
న్యూఢిల్లీ : న్యూఢిల్లీలో 20 ఏళ్ల మహిళను kidnap, gang rape చేసి, కొట్టిన వీడియోపై కాంగ్రెస్ అధినేత Rahul Gandhi స్పందించారు. ఈ వీడియో గత వారం రోజులుగా social mediaలో హల్‌చల్ చేస్తుంది. "20 ఏళ్ల మహిళను దారుణంగా కొట్టిన వీడియో సమాజపు క్రూరమైన ముఖాన్ని బహిర్గతం చేస్తుంది" అని రాహుల్ గాంధీ ఆవేదనతో twitterలో పోస్ట్ చేశారు.
చాలా మంది భారతీయులు మహిళలను మనుషులుగా భావించడం లేదని ఆయన భాదను వ్యక్తం చేశారు. "చాలా మంది భారతీయులు స్త్రీలను మనుషులుగా పరిగణించరనేది చేదు నిజం. ఈ సిగ్గుచేటైన వాస్తవాన్ని గుర్తించి బయటకు చెప్పాలి." ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఢిల్లీ పోలీసులు.. పదకొండు మందిని అరెస్టు చేశారు.
అంతేకాదు ఈ విషయంపై తదుపరి విచారణ జరుగుతోందని, సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేయవద్దని పోలీసులు కోరారు. "ఈ సంఘటనను మతపరమైన కోణంలో చూపించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు, మరికొందరు బాధితురాలు ఆత్మహత్య చేసుకుందని పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. ఇది తప్పు, తప్పుడు సమాచారం. బాధితురాలు క్షేమంగా ఉంది" అని షహదారా డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆర్ సత్యసుందరం అన్నారు.
మహిళను కలిసిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ గురువారం ఒక ట్వీట్‌లో మాట్లాడుతూ ఢిల్లీ పోలీసులపై చర్యలు తీసుకోవాలని, మరిన్ని అరెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా అక్రమ మద్యం, మాదకద్రవ్యాల వ్యాపారంలో ప్రమేయం ఉన్న నిందితులపై గతంలో వచ్చిన ఫిర్యాదుల వివరాలను కూడా కమిషన్ కోరింది.
ఇదిలా ఉండగా, జనవరి 27న ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళను ఆమె ఇరుగు పొరుగువారే అత్యంత కిరాతకంగా హింసించారు. kidnap చేసి, gang rape చేయించి, గుండు గీయించి, ముఖానికి నల్లరంగు వేసి వీధుల్లో ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఈ ఉదయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు నలుగురు మహిళలను అరెస్టు చేశారు.
తూర్పు delhiలోని షాహదారా ప్రాంతంలో personal enmity నేపథ్యంలో వివాహిత, ఒక బిడ్డకు తల్లి అయిన 20 యేళ్ల మహిళ మీద ఇరుగుపొరుగు వారే దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంలో ఈ ఘటనపై Delhi Women's Commission సీరియస్ అయ్యింది. నిందితులమీద మరిన్ని చర్యలు తీసుకోవాలని, మరిన్ని అరెస్టులు చేయాలని డిమాండ్ చేసింది.
బాధిత మహిళను కమిషన్ చైర్‌పర్సన్ Swati Maliwal కలిసి మాట్లాడారు. 20 యేళ్ల యువతిపై అక్రమ మద్యం విక్రయదారులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, దారుణంగా హింసించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్విటర్ లో ఆ వీడియో షేర్ చేస్తూ... "కస్తూర్బా నగర్‌లో 20 ఏళ్ల యువతిపై అక్రమ మద్యం విక్రయదారులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు గుండు కొట్టించి, ముఖానికి నల్లరంగు వేసి, ఆ తరువాత ఆమెను వీధుల్లో ఊరేగించారు. మెడలో చెప్పుల దండ వేసి కొడుతూ దారుణంగా అవమానించారు. హింసించారు. ఈ ఘటనలో నిందితులైన స్త్రీ, పురుషులందర్నీ అరెస్ట్ చేయాలని నేను ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేస్తున్నాను. అమ్మాయికి, ఆమె కుటుంబానికి భద్రత కల్పించాలి" అని మలివాల్ ట్వీట్ చేశారు.