మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు డెంగ్యూ.. ఎయిమ్స్ అధికారులు ఏం చెప్పారంటే?

By telugu teamFirst Published Oct 16, 2021, 2:38 PM IST
Highlights

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ డెంగ్యు జ్వరంతో బాధపడుతున్నారు. అయితే, ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నదని ఎయిమ్స్ వెల్లడించింది. ఆయనకు ప్లేట్‌లెట్స్ కూడా పెరుగుతున్నాయని, ఇప్పుడు ఆయన ఔటాఫ్ డేంజర్ అని ఎయిమ్స్ అధికారులు తెలిపారు.
 

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి Manmohan Singh డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్టు AIIMS శనివారం వెల్లడించింది. కానీ, ఆయన health condition క్రమంగా మెరుగుపడుతున్నదని తెలిపింది. ప్రస్తుతం ఆయనకు అపాయమేమీ లేదని వివరించింది. Ex PM మన్మోహన్ సింగ్‌కు ప్లేట్‌లెట్స్ పెరుగుతున్నాయని, ఆయన ఇప్పుడు ఔటాఫ్ డేంజర్ అని ఎయిమ్స్ అధికారులు తెలిపారు.

తీవ్ర జ్వరం, నీరసంతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. మన్మోహన్ సింగ్‌కు ఏళ్లుగా సేవలందిస్తున్న పర్సనల్ ఫిజిషియన్ నితీశ్ నాయక్ గైడెన్స్‌లో కార్డియాలజిస్ట్ బృందం చికిత్స అందిస్తున్నది. ఈ రోజు ఓ మీడియా సంస్థతో ఎయిమ్స్ అధికారులు మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, ఆయన platelets పెరుగుతున్నాయని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి ముప్పేమీ లేదని వివరించారు.

కరోనా వైరస్ సెకండ్ వేవ్ సమయంలో మన్మోహన్ సింగ్‌ కొవిడ్-19 బారినపడ్డారు. అప్పుడూ ఇదే ఎయిమ్స్‌లో చేరి చికిత్స తీసుకున్నారు. గతేడాది మే నెలలోనూ ఛాతిలో నొప్పి రావడంతో ఇందులోనే అడ్మిట్ అయ్యారు.

తీవ్ర జ్వరంతో బుధవారం ఆయన ఎయిమ్స్‌లో చేరగానే దేశంలోని ప్రముఖులందరూ ఆయన వేగంగా కోలుకోవాలని, క్షేమంగా తిరిగిరావాలని కోరుకున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మాజీ మంత్రి అశ్వని కుమార్, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సహా పలువురు హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. 

మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లో చేరిన తర్వాతి రోజు రాహుల్ గాంధీ హాస్పిటల్ వెళ్లారు. మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ కౌర్‌ను ఓదార్చారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను పరామర్శించడానికి వెళ్లి ఆయనతో ఫొటో దిగిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బీజేపీకి ప్రతి ఒక్కటి ఫొటో ప్రచారం చేయడానికే అనుగుణమైనవిగానే కనిపిస్తాయని మండిపడింది. మన్మోహన్ సింగ్‌ను పరామర్శించడానికి వెళ్లడమూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయాకు పీఆర్ స్టంట్ మాదిరిగానే కనిపిచిందని ఆగ్రహించింది. మాజీ ప్రధాని గోప్యతను భంగపరచడమే కాదు, కనీస నైతిక విలువలు మరిచిపోయి, సంప్రదాయాలను విస్మరించిన కేంద్ర మంత్రి మాండవీయా వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా డిమాండ్ చేశారు.

click me!