ఢిల్లీ లిక్కర్ స్కాం: దినేష్ ఆరోరా‌ను అరెస్ట్ చేసిన ఈడీ

Published : Jul 07, 2023, 09:52 AM ISTUpdated : Jul 07, 2023, 10:02 AM IST
ఢిల్లీ లిక్కర్ స్కాం:  దినేష్ ఆరోరా‌ను అరెస్ట్ చేసిన ఈడీ

సారాంశం

న్యూఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అనుచరుడిగా ఉన్న దినేష్ ఆరోరాను  ఈడీ అధికారులు  గురువారంనాడు రాత్రి అరెస్ట్  చేశారు. 

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం  మనీష్ సిసోడియా అనుచరుడు  దినేష్ ఆరోరా ను ఈడీ అధికారులు  గురువారంనాడు రాత్రి అరెస్ట్  చేశారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సీబీఐకి  దినేష్ ఆరోరా  అప్రూవర్ గా మారాడు.  అయితే  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  లభ్యమైన సాక్ష్యాల ఆధారంగా  దినేష్ ఆరోరాను  ఈడీ అధికారులు  గురువారంనాడు రాత్రి అరెస్ట్  చేశారు.  నిన్న ఉదయం  దినేష్ ఆరోరాను  ఈడీ అధికారులు అరెస్ట్  ప్రశ్నించారు. అయితే  ఈడీ అధికారులు  దినేష్ ఆరోరాను  మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని భావించి అరెస్ట్  చేశారు. 

దినేష్ ఆరోరాను  నిన్న రాత్రి న్యూఢిల్లీలోని  ఈడీ కార్యాలయంలో  ఉంచారు.  ఇవాళ  దినేష్ ఆరోరాను  కోర్టులో హాజరుపర్చనున్నారు  ఈడీ అధికారులు.  ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి  ఇంకా  లోతుగా విచారించాల్సి ఉన్నందున  దినేష్ ఆరోరాను  కస్టడీ కోరాలని ఈడీ భావిస్తుంది.

ఆప్ కమ్యూనికేషన్ ఇంచార్జీ విజయ్ నాయర్ తో  వ్యాపారవేత్త  విజయ్ నాయర్ సన్నిహితంగా వ్యవహరించారని  ఈడీ గతంలో  దాఖలు  చేసిన చార్జీషీట్ లో  పేర్కొన్న విషయం  తెలిసిందే.ఢిల్లీ లిక్కర్ స్కాంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను  ఆరోరా  కలిశారని  ఈడీ  గతంలో ఆరోపణలు  చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో   ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను  ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో  సీబీఐ అధికారులు అరెస్ట్  చేశారు.

అంతకుముందు పలుమార్లు  ఈ కేసు విషయమై ఆయనను సీబీఐ అధికారులు విచారించారు.  ఈ కేసులో  అరెస్టైన మనీష్ సిసోడియా  తీహార్ జైలులో  ఉన్నాడు.  ఇదే కేసులో  మనీష్ సిసోడియాను  ఈడీ అధికారులు ఈ ఏడాది మార్చి  9వ తేదీన  అరెస్ట్  చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశంలోని పలు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది.  ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఆప్ సహా  బీఆర్ఎస్ పై  బీజేపీ నేతలు  విమర్శలు గుప్పించారు.  ఈ విమర్శలను ఆప్, బీఆర్ఎస్ తీవ్రంగా  ఖండించాయి.


 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !