Manipur violence: మణిపూర్ అల్లర్లు.. బీజేపీ ఎమ్మెల్యేపై మూక‌దాడి, ప‌రిస్థితి విష‌మం

Published : May 05, 2023, 03:10 AM IST
Manipur violence: మణిపూర్ అల్లర్లు.. బీజేపీ ఎమ్మెల్యేపై మూక‌దాడి, ప‌రిస్థితి విష‌మం

సారాంశం

Manipur violence: మణిపూర్ అల్లర్లు హింసాత్మ‌కంగా మారాయి. ఈ నేప‌థ్యంలోనే ఒక‌ బీజేపీ ఎమ్మెల్యేపై మూక‌దాడి జ‌రిగింది. ఇంఫాల్ లో బీజేపీ నేత వుంగ్జాగిన్ వాల్టేపై ఓ గుంపు దాడి చేసింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఇంఫాల్ రిమ్స్ కు చికిత్స నిమిత్తం త‌ర‌లించారు.

BJP MLA Vungzagin Valte attacked by mob in Imphal: అల్లర్ల నేప‌థ్యంలో మ‌ణిపూర్ లో ఒక‌ బీజేపీ ఎమ్మెల్యేపై మూక‌దాడి జ‌రిగ‌గింది. ఇంఫాల్ లో బీజేపీ నేత వుంగ్జాగిన్ వాల్టేపై ఓ గుంపు దాడి చేసింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఇంఫాల్ రిమ్స్ కు చికిత్స నిమిత్తం త‌ర‌లించారు.

వివ‌రాల్లోకెళ్తే.. ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ను కలిసిన అనంతరం రాష్ట్ర సచివాలయం నుంచి తిరిగి వస్తుండగా ఇంఫాల్ లో బీజేపీ ఎమ్మెల్యే వుంగ్జాగిన్ వాల్టేపై ఓ గుంపు దాడి చేసింది. మణిపూర్ లో గిరిజనులు, మెజారిటీ మేటీల మధ్య హింస చెలరేగడంతో శాంతిభద్రతలు క్షీణించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. చాలా ప్రాంతాల్లో హింస చెల‌రేగుతోంది. ఫెర్జాల్ జిల్లా థాన్లాన్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వాల్టే ఇంఫాల్ లోని తన అధికారిక నివాసానికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది.

ఆగ్రహించిన దుండగులు ఎమ్మెల్యే, ఆయన డ్రైవర్ పై దాడి చేయగా ఆయన పీఎస్ వో తప్పించుకున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఇంఫాల్ లోని రీజనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్ )లో చికిత్స పొందుతున్నారు. వాల్టే కుకి సామాజిక వర్గానికి చెందినవారు. గత బీజేపీ ప్రభుత్వంలో మణిపూర్ గిరిజన వ్యవహారాల మంత్రిగా ప‌నిచేశారు. 

మణిపూర్ హింసకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

  • రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్న గిరిజనేతరులకు షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కల్పించాలన్న డిమాండ్ కు నిరసనగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ఏటీఎస్ యూఎం) ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రంలోని పది కొండ జిల్లాల్లో 'ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ ' నిర్వహించారు.
  • చురాచంద్ పూర్ జిల్లాలోని టోర్బంగ్ ప్రాంతంలో జరిగిన కవాతు సందర్భంగా సాయుధ గుంపు మేటీ కమ్యూనిటీ ప్రజలపై దాడి చేసిందనీ, ఇది లోయ జిల్లాల్లో ప్రతీకార దాడులకు దారితీసిందనీ, ఇది రాష్ట్రవ్యాప్తంగా హింసను పెంచిందని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.
  • టోర్బంగ్ లో మూడు గంటలకు పైగా కొనసాగిన హింసాత్మ‌క దాడుల్లో పలు దుకాణాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. 
  • ప్రజలు శాంతిని కాపాడాలని కోరిన ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్, ఆస్తుల నష్టంతో పాటు విలువైన ప్రాణాలను కోల్పోయారనీ, ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. సమాజంలో అపోహల కారణంగానే ఈ హింస చోటు చేసుకుందని సీఎం అన్నారు.
  • మణిపూర్ అంతటా చెలరేగిన అల్లర్లను అదుపు చేయడానికి ఆర్మీ, అస్సాం రైఫిల్స్ కు చెందిన 55 కాలమ్స్ ను మోహరించారు.
  • మణిపూర్ రాష్ట్రంలో పెరుగుతున్న హింసను నియంత్రించడానికి తీవ్రమైన సందర్భాల్లో కాల్పులు జరిపేందుకు గవర్నర్ గురువారం ఆమోదం తెలిపారు.
  • మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. హింస, వదంతుల వ్యాప్తిని నియంత్రించే ప్రయత్నంలో భాగంగా మ‌ణిపూర్ లో ఇంట‌ర్నెట్ సేవ‌లు నిలిపివేశారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్