కాంగ్రెస్‌ గూటికి ఎమ్మెల్యేలు: మణిపూర్‌లో పతనం అంచున బీజేపీ ప్రభుత్వం

By Siva KodatiFirst Published Jun 18, 2020, 3:40 PM IST
Highlights

మణిపూర్‌లో ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ సారథ్యంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం పతనం అంచున నిలిచింది. బీజేపీ, టీఎంసీ, ఎన్‌పీపీలకు చెందిన మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు బిరెన్ సింగ్ ప్రభుత్వం మీద అసమ్మతి ప్రకటించింది కాంగ్రెస్‌ గూటికి చేరారు

మణిపూర్‌లో ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ సారథ్యంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం పతనం అంచున నిలిచింది. బీజేపీ, టీఎంసీ, ఎన్‌పీపీలకు చెందిన మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు బిరెన్ సింగ్ ప్రభుత్వం మీద అసమ్మతి ప్రకటించింది కాంగ్రెస్‌ గూటికి చేరారు.

ఎన్పీపీకి చెందిన నలుగు, బీజేపీకి చెందిన ముగ్గురు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో హస్తం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.

దీంతో 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ బలం 18కి పడిపోయింది. రాజీనామా చేసిన వారిలో ఉప ముఖ్యమంత్రి వై జాయ్ కుమార్ సింగ్, మరో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు.

కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కో సీటుకు ఒక్కొక్క అభ్యర్ధిని నిలబెట్టిన కీలకమైన రాజ్యసభ ఎన్నికలకు ఒక రోజు  ముందే మణిపూర్‌లో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి.

దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి నింగోంబం బుపెండా మీటి మాట్లాడుతూ.. భారతదేశంలో బీజేపీ పాలన  పతనానికి ప్రారంభం ఈ రోజు మణిపూర్‌లోని ఇంఫాల్‌లో జరుగుతోంది.

అతి త్వరలో మణిపూర్‌లోని కాంగ్రెస్ సారధ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని వ్యాఖ్యానించారు. ఓక్రామ్ ఇబోబి సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు  స్వీకరిస్తారని బుపెండా అభిప్రాయపడ్డారు. 

click me!