లాక్‌డౌన్ ఎఫెక్ట్: విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న మాజీ ఎమ్మెల్యే

By narsimha lodeFirst Published Jun 18, 2020, 2:52 PM IST
Highlights

మాజీ ఎమ్మెల్యే మళ్లీ తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో టెన్త్ పరీక్షలు నిలిచిపోయాయి.రాజకీయాల్లో బిజీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తున్నాడు.


బెంగుళూరు: మాజీ ఎమ్మెల్యే మళ్లీ తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో టెన్త్ పరీక్షలు నిలిచిపోయాయి.రాజకీయాల్లో బిజీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తున్నాడు.

ఆన్‌లైన్ క్లాసుల ద్వారా పదో తరగతి విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే క్లాసులు నిర్వహిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని కదూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు సేవ అందించారు వైఎస్వీ దత్తా. 1970లో రాజకీయాల్లో ఆయన ప్రవేశించారు. 1990 నుండి జనతాదళ్‌లో క్రియాశీలక పాత్ర పోషించారు. చాలా కాలం రాజకీయాల్లో పనిచేశారు.

లాక్ డౌన్ నేపథ్యంలో టెన్త్ విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఆయన నడుం బిగించాడు. ఫేస్‌బుక్ లైవ్ ద్వారా విద్యార్థులకు గణితం, భౌతిక శాస్త్రం పాఠాలను బోధిస్తున్నారు.

వైఎస్వీ దత్తా రాజకీయాలకు రాకముందు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాడు. బెంగుళూరులో డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు గణితం బోధించేవాడు. ఈ అనుభవంతోనే విద్యార్థులకు మళ్లీ ఉపాధ్యాయుడిగా మారాడు. 

 ఈ నెల 25వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సమయంలో ఆయన సుమారు 40వేల మంది విద్యార్థులకు పాఠాలు బోధించాడు. విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే పాఠాలు చెప్పడాన్ని  ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సురేశ్‌కుమార్‌ అభినందించారు. 


 

click me!