డ్యాన్స్ ఇరగదీసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..!

Published : Feb 19, 2022, 08:29 AM IST
డ్యాన్స్ ఇరగదీసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..!

సారాంశం

స్మృతి ఇరానీ అక్కడున్న కళాకారులతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. అందరితో కలిసి నాట్యం చేస్తూ అలరించారు. 

త్వరలో మణిపూర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో.. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ  ఆ రాష్ట్రంలో పర్యటించారు. ఇంఫాల్ ఈస్ట్‌లోని వాంగ్‌ఖీ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో  ఆమె  పాల్గొన్నారు. స్మృతి ఇరానీ అక్కడున్న కళాకారులతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. అందరితో కలిసి నాట్యం చేస్తూ అలరించారు. 

మణిపూర్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు కేంద్ర మంత్రులు... బీజేపీ నాయకులు జోరుగా పర్యటనలు, ప్రచారాలు నిర్వహిస్తున్నారు. 60 సీట్లు ఉన్న మణిపూర్ అసెంబ్లీకి మార్చి 19 తో గడువు ముగియనుంది. దీంతో ఆలోగా అక్కడ కొత్త ప్రభుత్వం కొలువు తీరాల్సి ఉంది. మణిపూర్ లో రెండు దశల్లో ఫిబ్రవరి 27, మార్చి 3వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న కౌంటింగ్ జరగనుంది. 2017 ఎన్నికల్లో ఫలితాల తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో తొలి సారిగా ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది.

 

ఇక కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రస్తుతం మోడీ కేబినెట్‌లో మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆమె నటి కూడా... టీవీ సీరియల్స్‌, యాడ్స్‌లో నటించారు. స్మృతి చిన్నప్పటి నుంచే ఆరెస్సెస్ లో సభ్యురాలు. 2003 లో బిజెపిలో చేరారు. 2004 ఎన్నికల్లో దిల్లీ చాందినీ చౌక్ నుంచి కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పై పోటీ చేసి ఓడిపోయారు. కానీ బిజెపికి ఓటుబ్యాంకు సంపాదించిపెట్టింది. తర్వాత ఆమెను మహారాష్ట్ర యువత విభాగానికి అధ్యక్షులుగా నియమించింది పార్టీ. కొన్నాళ్ళకు బిజెపి జాతీయ కార్యదర్శిగా, బిజెపి మహిళా కార్యదర్శిగా, బిజెపి మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఎదిగారు.  2014 లో ఏర్పాటైన మోడీ ప్రభుత్వంలో మానవ వనరుల శాఖకు మంత్రిగా స్మృతి ఇరానీ బాధ్యతలు చేపట్టారు.
 

PREV
click me!

Recommended Stories

Dr KA Paul Speech: అమెరికా అసెంబ్లీలో కేఏ పాల్ స్పీచ్ | America Assembly | Asianet News Telugu
Nitin Nabin Net Worth : బిజెపి నూతన జాతీయాధ్యక్షుడి ఆస్తిపాస్తులు ఎన్నో తెలుసా..?