‘మార్చి 10 తరువాత బుల్ డోజర్లు పనిచేస్తాయి’.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్...

Published : Feb 19, 2022, 07:47 AM IST
‘మార్చి 10 తరువాత బుల్ డోజర్లు పనిచేస్తాయి’.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్...

సారాంశం

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో బుల్ డోజర్ల రచ్చ ముగియడం లేదు. తాజాగా సీఎం యోగీ ఆదిత్యనాథ్.. మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు తరువాత బుల్ డోజర్లు పనిచేస్తాయంటూ.. వ్యాఖ్యానించారు. 

ఉత్తరప్రదేశ్ : ‘రాష్ట్రంలోని bulldozer లు మొత్తం Repairలకు పంపాం. మార్చి 10 (ఓట్ల లెక్కింపు) తర్వాత అన్నీ పనిచేస్తాయి’ అని Uttar Pradesh సీఎం Yogi Adityanath వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని  నేరగాళ్ల మీద తమ ప్రభుత్వం అనుసరించే వైఖరి గురించి చెబుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మైన్ పురీ ఎన్నికల సభలో యోగి మాట్లాడారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బుల్డోజర్ లకు పని చెబుతారా? అని సమాజ్వాది పార్టీ నేత అడిగిన ప్రశ్నకు జవాబుగా తాను ఈ మాటలు అంటున్నట్లుగా వివరించారు.  

యంత్రాలకు కూడా విశ్రాంతి అవసరం కదా అన్నారు . అక్రమ ఆస్తుల విధ్వంసానికి తమ ప్రభుత్వం బుల్ డోజర్లను వాడుతుందని చెప్పారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా కలుగుల్లో దాక్కొన్నవారంతా ఎన్నికల ప్రకటనతో బయటికి వచ్చి అరుస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా, ఉత్తరప్రదేశ్ లో రెండు దశల ఎన్నికల పోలింగ్ ముగిసింది. మూడో దశ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇక ఈ రెండు దశల ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి. 

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 16న తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇలాంటివ్యాఖ్యలే చేసి చిక్కుల్లో పడ్డాడు... ‘యూపీలో వేల సంఖ్యలో  JCBs, bulldozerలను యోగి తెప్పించారు. ఎన్నికల తర్వాత Yogi Adityanathకి ఎవరెవరు మద్దతు ఇవ్వలేదో వారిని అన్ని ప్రాంతాల్లో గుర్తిస్తాం. జేసీబీలు, బుల్డోజర్ లు ఎందుకు వస్తాయో మీకు తెలుసు కదా?.. ’ అంటూ BJP MLA Rajasingh మరోసారి Controversial comments చేశారు. యోగి ఆదిత్యానాథ్ ఈ సారి ముఖ్యమంత్రి కాకపోతే మీరు యూపీలో ఉంటారో… రాష్ట్రం విడిచి పారిపోతారో తేల్చుకోండి’ అని హెచ్చరించారు.

ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసే వాళ్ళు యూపీ విడిచి వెళ్లక తప్పదని చెప్పారు. యూపీ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చిన ఆయన.. యోగి ఆదిత్యనాథ్ కు ఓటు వేయకుంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు రాజాసింగ్ మంగళవారం వీడియో విడుదల చేశారు. మంగళవారం జరిగిన రెండో విడత పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల అత్యధిక పోలింగ్ జరిగింది అని పేర్కొంటూ... యోగిని వ్యతిరేకిస్తున్న వారే ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేసి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. మూడో దశ పోలింగ్ లో హిందువులంతా బయటకు రావాలని పిలుపునిచ్చారు.

రాజా సింగ్ ను తక్షణం అరెస్టు చేయాలి…
యూపీలో ఓటర్లను బెదిరిస్తూ రాజాసింగ్ బాహాటంగా వ్యాఖ్యలు చేశారని, అందుకు ఆయనను తక్షణం అరెస్టు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ రాజాసింగ్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని.. ఈసీ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. 

రాజాసింగ్ వ్యాఖ్యల మీద ఈసీ సీరియస్ అయ్యింది. అయితే దీంతో యోగి వస్తే ఏమవుతుందో.. అఖిలేష్ గెలిస్తే ఏం జరుగుతుందోనని మాత్రమే అలా వ్యాఖ్యానించానంటూ రాజాసింగ్ ఈసీ నోటీసులకు వివరణ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !