రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర: అనుమతి నిరాకరించిన మణిపూర్ సర్కార్

By narsimha lodeFirst Published Jan 10, 2024, 2:29 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ  భారత్ న్యాయ యాత్రకు  మణిపూర్ ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. 


న్యూఢిల్లీ:   కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ ఈ నెల  14వ తేదీ నుండి ప్రారంభించనున్న భారత్ న్యాయ యాత్రకు మణిపూర్ ప్రభుత్వం బుధవారం నాడు అనుమతిని నిరాకరించింది.

ఈ నెల  14వ తేదీ నుండి  మణిపూర్ లోని ఇంఫాల్ నుండి  భారత్ న్యాయ యాత్రను  ప్రారంభించాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే  కె. మేఘచంద్ర  ఇవాళ పార్టీ నేతలతో కలిసి  ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ను కలిశారు.  భారత్ న్యాయ యాత్రకు  అనుమతి ఇవ్వాలని కోరారు.రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితుల నేపథ్యంలో ఈ యాత్రకు అనుమతిని ఇవ్వలేమని బీరెన్ సింగ్  చెప్పారని  కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. 

Latest Videos

భారత్ న్యాయ యాత్రకు  అనుమతిని ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరంగా  కాంగ్రెస్ నేత మేఘచంద్ర పేర్కొన్నారు. భారత్ న్యాయ యాత్రకు  అనుమతి ఇవ్వడంపై  ముఖ్యమంత్రి బీరెన్ సింగ్  కీలక వ్యాఖ్యలు చేశారు.  భద్రతా సంస్థల నివేదికల నుండి నివేదకలు వచ్చిన తర్వాత  నిర్ణయం తీసుకుంటామని మణిపూర్  సీఎం బీరెన్ సింగ్  చెప్పారు.

మణిపూర్ లో శాంతిభద్రతలు  చాలా క్లిష్టంగా ఉన్నాయని ఇటీవల జరిగిన  సమావేశంలో  సీఎం బీరెన్ సింగ్  చెప్పారు. రాహుల్ గాంధీ యాత్రకు భద్రతా  సంస్థల నుండి వచ్చిన నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని  సీఎం  విలేకరుల ప్రశ్నలకు  సమాధానం చెప్పారు.

భారత్ న్యాయ యాత్రను ఈ ఏడాది జనవరి  14 నుండి ప్రారంభించాలని  కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. 66 రోజుల పాటు  6,713 కి.మీ. యాత్ర చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు.  దేశంలోని  పలు రాష్ట్రాల్లోని  110 జిల్లాలు, 100 లోక్ సభ స్థానాలు, 337  అసెంబ్లీ సెగ్మెంట్ల గుండా  ఈ యాత్ర సాగాలని  కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. 

 ఈ ఏడాది మార్చి  20వ తేదీన భారత్ న్యాయ యాత్ర ముంబైలో ముగియనుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు,  ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ అగ్రనేతలు ఈ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఈ యాత్రను  కాంగ్రెస్ పార్టీ చీఫ్  మల్లికార్జున ఖర్గే  జెండా ఊపి ప్రారంభించనున్నారు.

click me!