త్రిపుర సీఎంగా మరోసారి మాణిక్ సాహా!.. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక.. 8న ప్రమాణస్వీకారం

Published : Mar 06, 2023, 06:57 PM IST
త్రిపుర సీఎంగా మరోసారి మాణిక్ సాహా!.. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక.. 8న ప్రమాణస్వీకారం

సారాంశం

త్రిపుర సీఎంగా రెండో సారి బాధ్యతలు తీసుకోవడానికి మాణిక్ సాహాకు మార్గం సుగమమైంది. సోమవారం త్రిపురలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా మాణిక్ సాహాను ఎన్నుకున్నారు. మార్చి 8వ తేదీన ఆయన సీఎంగా ప్రమాణం తీసుకుంటారు.  

గువహతి: త్రిపుర ముఖ్యమంత్రిగా మరోసారి మాణిక్ సాహా బాధ్యతలు తీసుకోనున్నారు. సోమవారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ శాసనసభాపక్ష నేతగా మాజీ సీఎం మాణిక్ సాహాను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో త్రిపుర సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టడానికి మాణిక్ సాహాకు రూట్ క్లియర్ అయింది.

మార్చి 8వ తేదీన త్రిపుర ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండబోతున్నది. ప్రధానమంత్రి నరేంద్ర  మోడీ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. సీఎంగా మాణిక్ సాహాతో రాష్ట్ర గవర్నర్ ప్రమాణం చేయిస్తారు.

ఇటీవలే జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు గాను బీజేపీ 32 సీట్లు గెలుచుకుంది. బీజేపీ మిత్రపక్షం ఇండిజీనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ) ఒక్క సీటు గెలుచుకుంది.

రాజకీయాల్లోకి రాకపూర్వం మాణిక్ సాహా దంత వైద్యుడిగా పని చేశారు.

Also Read: ట్రైన్ చివరి బోగీ వెనుకాల ‘X’ సింబల్ ఎందుకు ఉంటుందో తెలుసా? రైల్వే శాఖ వివరణ ఇదే 

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 2016లో బీజేపీ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పది నెలల ముందు బీజేపీ ఆయనను రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించింది. బిప్లబ్ కుమార్ దేబ్ స్థానంలో మాణిక్ సాహాను అపాయింట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు