ఢిల్లీలో దారుణం.. వైద్యురాలిపై జైలులోనే ఖైదీ అత్యాచారం, హత్యాయత్నం..

By SumaBala BukkaFirst Published Sep 28, 2022, 12:24 PM IST
Highlights

ఢిల్లీలోని మండోలి జైలులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తనకు వైద్య చేయడానికి వచ్చిన వైద్యురాలిపై ఓ నేరస్తుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఢిల్లీ : జైలుకెళ్లినా ఆ వ్యక్తి బుద్ది మారలేదు. తనకు వైద్యం చేయడానికి వచ్చిన వైద్యురాలిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అచ్చం సినిమాల్లో చూపించినట్టుగానే జరిగిన ఈ ఘటనలో వైద్యురాలిమీద హత్యాయత్నం కూడా చేశాడు. కానీ ఆమె తప్పించుకోగలిగింది. 

ఢిల్లీలోని మండోలి జైలులో సోమవారం ఓ ఖైదీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం చేసి చంపేందుకు ప్రయత్నించాడు. మహిళలపై నేరాలకు పాల్పడిన రెండు కేసుల్లో జైలుకెళ్లిన నిందితుడు జైలుకు వచ్చిన మహిళా వైద్యురాలిపై అత్యాచారయత్నం చేశాడు.

మండోలి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 26న ఈ ఘటన జరిగింది. బాధితురాలికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అత్యాచారం, హత్యాయత్నం కింద కూడా కేసు నమోదు చేశారు.ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. సుబ్రత్ పిళ్లై అనే నిందితుడికి గతంలో ఒక కేసులో ఏడాదిపాటు జైలు శిక్ష, 10,000 జరిమానా విధించారు. 

అనుమానంతో భార్యను హత్య చేసి, మృతదేహాన్ని అత్తగారింటిముందు పడేసి.. ఓ భర్త దారుణం..

ఇదిలా ఉండగా, మంగళవారం ఢిల్లీలో ఎయిర్ హోస్టెస్ పై అత్యాచార ఘటన రేపింది. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఎయిర్ హోస్టెస్‌ కు పరిచయస్తులే ఆమె మీద.. ఆమె ఇంట్లోనే.. అత్యాచారానికి పాల్పడ్డారని సోమవారం పోలీసులు తెలిపారు. నిందితుడు, ఖాన్‌పూర్ నివాసి అయిన హర్జీత్ యాదవ్, ఆ ప్రాంతానికి చెందిన రాజకీయ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్. అతడిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.

ఆదివారం మెహ్రౌలీ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారానికి సంబంధించి పిసిఆర్ కాల్ వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) చందన్ చౌదరి తెలిపారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలు పోలీసులకు జరిగిన విషయాన్ని తెలుపుతూ నిందితుడు హర్జీత్ యాదవ్ గా పేర్కొంది. అతను తనకు గత నెలన్నరగా పరిచయం అని తెలిపింది. నిందితుడు మద్యం మత్తులో తన ఇంటికి వచ్చి అత్యాచారం చేశాడని బాధితురాలు పేర్కొంది. 

30 ఏళ్ల బాధితురాలైన మహిళ నిందితుడిని గదిలో బంధించి.. 112కు కాల్ చేసిందని పోలీసులు తెలిపారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా, ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్‌లు 376 (అత్యాచారం), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 509 (మహిళను కించపరిచే మాట, సంజ్ఞ లేదా చర్య), 377 (అసహజ నేరాలు) కింద కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు డీసీపీ తెలిపారు.

click me!