ఎంబీబీఎస్ పరీక్ష మరోకరితో రాయించి..!

By telugu news teamFirst Published Mar 13, 2021, 11:42 AM IST
Highlights

రాజ‌స్థాన్‌కు చెందిన మ‌నోహ‌ర్ సింగ్ గ‌త ఆరేళ్లుగా ఎఫ్ఎంజీఈ ప‌రీక్ష రాస్తున్నాడు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అత‌ను ఆ ప‌రీక్ష పాస్ కాలేక‌పోయాడు. 

ఎంబీబీఎస్ చదవిది అతను... కానీ పరీక్ష మాత్రం మరో వ్యక్తితో రాయించాడు. కాగా.... సదరు వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కాగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

త‌జ‌కిస్థాన్ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ పొందిన మ‌నోహ‌ర్‌.. ఇండియాలో ప్రాక్టీసు  లైసెన్సు కావాలంటే ఎఫ్ఎంజీఈ ప‌రీక్ష పాస్ కావాల్సిందే. నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జిమినేష‌న్స్ నిర్వ‌హించే ఆ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన వారే ఇండియాలో మెడిక‌ల్ ప్రాక్టీసు చేయాల్సి ఉంటుంది. 

రాజ‌స్థాన్‌కు చెందిన మ‌నోహ‌ర్ సింగ్ గ‌త ఆరేళ్లుగా ఎఫ్ఎంజీఈ ప‌రీక్ష రాస్తున్నాడు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అత‌ను ఆ ప‌రీక్ష పాస్ కాలేక‌పోయాడు. దీంతో ఈసారి అత‌ను మ‌రో వ్య‌క్తితో ప‌రీక్ష రాయించాడు.  అయితే ఈ ఘ‌ట‌న ఇటీవ‌లే వెలుగులోకి వ‌చ్చింది.   గ‌త ఏడాది డిసెంబ‌ర్ 4వ తేదీన ఎఫ్ఎంజీఈ ప‌రీక్ష నిర్వ‌హించారు. మ‌థురా రోడ్డు సెంట‌ర్‌లో అత‌ను ప‌రీక్ష రాయాల్సి ఉంది.

ఆ రోజు ప‌రీక్ష రాసిన వ్య‌క్తికి.. అప్లికేష‌న్‌లో ఉన్న ఫోటోకు తేడా రావ‌డంతో అధికారులు.. ఫేస్ ఐడీ వెరిఫికేష‌న్ కోసం అత‌న్ని పిలిచారు. ఫేస్ ఐడీ వెరిఫికేష‌న్ కోసం ఎన్‌బీఈకి వ‌చ్చిన మ‌నోహ‌ర్‌ను అధికారులు ప‌ట్టుకున్నారు.  ఫోటోలు మ్యాచ్‌ కాక‌పోవ‌డం వ‌ల్ల అత‌న్ని అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు.  

కొన్ని ప్ర‌శ్న‌ల‌కు త‌ప్పుడు స‌మాధానాలు ఇవ్వ‌డం వ‌ల్ల కూడా అత‌నిపై అనుమానాలు వ‌చ్చిన‌ట్లు చెప్పారు. మ‌నోహ‌ర్‌ను అరెస్టు చేసి అత‌ని నుంచి అడ్మిట్ కార్డు, ఎంబీబీఎస్ డిగ్రీ, అప్లికేష‌న్‌ను సీజ్ చేశారు.  త‌న వ‌ద్ద 4 ల‌క్ష‌లు తీసుకుని ఓ డాక్ట‌ర్ త‌న త‌ర‌పున ప‌రీక్ష రాసిన‌ట్లు మ‌నోహ‌ర్ పోలీసుల ముందు అంగీక‌రించాడు.   

click me!