రూ. 10లకే భోజనం: రాము తాత కన్నుమూత

By narsimha lodeFirst Published Jul 13, 2020, 6:01 PM IST
Highlights

రూ. 10లకే భోజనం పెట్టిన రాము అనే వృద్ధుడు ఆదివారం నాడు తెల్లవారుజామున కన్నుమూశాడు. రాము వయస్సు 90 ఏళ్లు. గత 50 ఏళ్లుగా ఆయనకు కనీసం జబ్బు కూడ సోకలేదు.  ఆరు నెలలుగా ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. 

చెన్నై: రూ. 10లకే భోజనం పెట్టిన రాము అనే వృద్ధుడు ఆదివారం నాడు తెల్లవారుజామున కన్నుమూశాడు. రాము వయస్సు 90 ఏళ్లు. గత 50 ఏళ్లుగా ఆయనకు కనీసం జబ్బు కూడ సోకలేదు.  ఆరు నెలలుగా ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. 

తమిళనాడు రాష్ట్రంలోని మధురైలోని వల్లీ టిఫిన్ సెంటర్ లో రూ. 10లకే నాణ్యమైన భోజనం అందిస్తాడు. తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందిస్తారని  రాము హోటల్ కు పేరుంది.

2014 నుండి ఒక గిన్నె అన్నం, సాంబారు, రసం, రెండు కూరలు, మజ్జిగతో భోజనాన్ని రూ. 10లకే రాము తాత హోటల్ లో అందించేవాడు. 
తల్లి మరణించిన తర్వాత 12 ఏళ్ల వయస్సులోనే రాము విల్లూరు గ్రామంలోని తన ఇంటి నుండి పారిపోయి అలంగనల్లూరులోని పలు దుకాణాల్లో పనిచేశాడు. 

17 ఏళ్ల వయస్సులో వడలూరులోని వల్లారు ఆలయానికి వచ్చిన సమయంలో నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ఆలోచన వచ్చిన సమయంలోనే ఈ హోటల్ కు అంకుర్పారణ చేశాడు రాము.

పురణతమ్మల్ అనే అమ్మాయిని రాము పెళ్లి చేసుకొన్నాడు. ఆమె వంట చేయడంలో పెట్టింది పేరు. 1965లో రాము దంపతులు వల్లీ టిఫిన్ సెంటర్ ను ప్రారంభించారు. ఇడ్లీ, వడ, అప్పం, టీ లను పది పైసలకు విక్రయించేవారు. 

కొద్ది కాలానికి మధ్యాహ్నం పూట రూ. 1.25లకు భోజనం అందించేవారు.నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా కూడ రాము ఒకటి రెండు సార్లు మాత్రమే భోజనం రేట్లు పెంచాడు.1975లో భోజనం ధరను రూ. 6లకు పెంచాడు. 2014లో ఈ ధరను రూ. 10లకు పెంచాడు.  సీనియర్ సిటిజన్లకు రాము ఉచితంగా భోజనం అందించేవాడు.

పలు ఎన్జీఓలు, ప్రైవేట్ సంస్థలు ఆయనకు అనేక అవార్డులు ఇచ్చాయి. కొందరు ఆయనకు విరాళాలు కూడ ఇచ్చారు. కానీ రాము మాత్రం తాను అందించే భోజనం నాణ్యతపైనే దృష్టి పెట్టాడు.

click me!