అంతుచిక్కని కేసు.. మహిళను చంపి మాంసం తిన్న వ్యక్తి మృతి.. ఏం జరిగిందో గుర్తించలేకపోయిన వైద్యులు!

Published : May 31, 2023, 02:33 PM IST
అంతుచిక్కని కేసు.. మహిళను చంపి మాంసం తిన్న వ్యక్తి మృతి.. ఏం జరిగిందో గుర్తించలేకపోయిన వైద్యులు!

సారాంశం

రాజస్తాన్‌లో ఓ మహిళను చంపి ఆమె మాంసం తిన్న ఘటన సంచలనంగా రేపింది. మాంసం తిన్న ఆ వ్యక్తి మంగళవారం ఉదయం హాస్పిటల్‌లో మరణించాడు. ఆయన చుట్టూ, ఆయన కండీషన్ చుట్టూ ఎన్నో మిస్టరీలు పెనవేసుకుని ఉన్నాయి.  

జైపూర్: రాజస్తాన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మహిళను చంపేసి ఆమె మాంసాన్ని తింటూ పట్టుబడ్డాడు. ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే మాంసం తిన్న వ్యక్తి అంతుచిక్కని సమస్యలతో మరణించాడు. సుమారు నాలుగైదు రోజుల నుంచి హాస్పిటల్‌లో ఉన్నప్పటికీ ఆయన మరణానికి గల స్పష్టమైన కారణాలు తెలియరాకపోవడం గమనార్హం.

ముంబయికి చెందిన 25 ఏళ్ల సురేంద్ర ఠాకూర్ రాజస్తాన్‌కు వెళ్లాడు. పాలి జిల్లా సేంద్ర పోలీసు స్టేషన్ పరిధిలోని సర్దానా గ్రామంలో పశువులను మేతకు తీసుకెళ్లిన ఓ వృద్ధ మహిళపై దాడి చేశాడు. ఆమె మరణించాక ఆమె మాంసాన్ని తిన్నాడు. ఆమె కొడుకు ఈ దృశ్యం చూసి బెంబేలెత్తిపోయాడు. మిగిలిన గ్రామస్తులు కలిసి సురేంద్ర ఠాకూర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఆయన రేబిస్ బారిన పడి ఉండొచ్చనే అనుమానంతో జోధ్‌పూర్‌లోని ఎంసీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. శనివారం నుంచి సురేంద్ర ఠాకూర్‌కు హాస్పిటల్‌లో చికిత్స అందుతున్నది. ఎంజీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజ్ శ్రీ బెహ్రా మాట్లాడుతూ.. హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పటి నుంచి బాగానే ఉన్నాడని, మంగళవారం ఉదయం కార్డియక్ అరెస్ట్ కావడంతో మరణించాడని వివరించారు. 

అసాధారణంగా ప్రవర్తిస్తున్న ఆ రేబిస్ పేషెంట్‌ను ఐసొలేషన్‌లో ఉంచామని, ఆయనకు చికిత్స పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని ఆయన చెప్పారు. సైకియాట్రి నుంచి న్యూరాలజీ వరకు చాలా మంది వైద్యులు ఆయన కండీషన్‌ను పరిశీలించారని, కానీ, ఏ వ్యాధి సోకిందనేది స్పష్టంగా గుర్తించలేకపోయారని వివరించారు.

హాస్పిటల్‌కు తీసుకువచ్చిన తర్వాత ఆయనను మెడికల్ స్టాఫ్, పోలీసులను కట్టడి చేయాలని ప్రయత్నించారు. అయినా కొందరిని కొరికాడు. బాధితులకూ రేబిస్ సోకే ముప్పుందని వ్యాక్సిన్ కూడా వారికి ఇవ్వడం గమనార్హం.

Also Read: ‘లోకమెలా నడుస్తుందో దేవుడికే ప్రధాని క్లాస్ చెబుతాడు’.. రాహుల్ గాంధీ వ్యంగ్య వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్

జోధ్‌పూర్ హాస్పిటల‌్ వైద్యుల ప్రిలిమినరీ అబ్జర్వేషన్ ఇలా ఉన్నది. సురేంద్ర ఠాకూర్ రేబిస్ లేదా వైరల్ ఎన్సెఫలిటిస్ లేదా కురు డిసీజ్ లేదా తీవ్ర బ్రెయిన్ డిజార్డర్ ఉండొచ్చు. సిటి స్కాన్ కూడా తీశారు. లివర్, కిడ్నీ ఎగ్జామినేషన్‌లో ఆయన లివర్ ఫెయిల్ అయినట్టు గుర్తించారు. బహుశా లిక్కర్ తాగడం వల్లేమో అని అనుమానించారు.

ఇదిలా ఉండగా.. పోలీసులు ఆయన కుటుంబం నుంచి వివరాలు సేకరించడానికి సురంద్ర ఠాకూర్ జేబులో దొరికిన ఆధార్ కార్డు సహాయంతో అడ్రస్‌ వెతుక్కుంటూ వెళ్లారు. కానీ, ఆయన కుటుంబ సభ్యులను కొనుగోనలేకపోయారు. వారి కుటుంబాన్ని కలుసుకోలేనంత కాలం ఆయన కండీషన్ ఏమిటీ? ఆయన ఇంతటి సంక్లిష్ట సమస్యలు పెట్టుకుని కూడా పాలికి ఎలా రాగలిగాడు అనే రహస్యాలను ఛేదించడం అసాధ్యంగా మారింది.

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu