మీ సుఖం కోసం..నన్నెందుకు కన్నారు..? కోర్టుకి ఎక్కిన కొడుకు

By ramya NFirst Published Feb 6, 2019, 4:55 PM IST
Highlights

నా అనుమతి లేకుండా నన్నెందుకు కన్నారంటూ.. ఓ యవకుడు కన్నతల్లిదండ్రులపై కోర్టుకు ఎక్కాడు. 

నా అనుమతి లేకుండా నన్నెందుకు కన్నారంటూ.. ఓ యవకుడు కన్నతల్లిదండ్రులపై కోర్టుకు ఎక్కాడు. ఈ వింత సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది.

ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబయికి చెందిన రఫాయిల్ శామ్యూల్(27) అనే యువకుడు తల్లిదండ్రులపై కేసు పెట్టాడు. తనని తాను యాంటీ నాటలిస్టు( పుట్టుకను వ్యతిరేకించేవాడు)గా చెప్పుకుంటున్నాడు. తల్లిదండ్రుల సుఖం కోసం పిల్లలను ఇష్టం లేకున్నా జీవిత చక్రబంధనంలోకి తీసుకురావడం తప్పు అంటూ అతను వాదించడం గమనార్హం.

శామ్యూల్.. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ...‘‘ మా తల్లిదండ్రులకు నాకు చాలా ఇష్టం.. మా మధ్య ఎలాంటి బేదాభిప్రాయాలు లేవు. కానీ వాళ్లు వారి సుఖం కోసమే నన్ను కన్నారని నేను భావిస్తాను. నా జీవితం బాగానే ఉంది. కానీ స్కూళ్లు, కెరీర్ పేరుతో నన్ను మరో జీవితంలోకి ఎందుకు నెట్టారో అర్థం కావడం లేదు’’ అని అన్నాడు. అతనికి ఫేస్ బుక్ ఫాలోవర్స్ కూడా వేలల్లో ఉండటం విశేషం.

నిహిలానంద్ పేరిట అతను నిర్వహిస్తున్న ఫేస్ బుక్ పేజీలో దీనికి సంబంధించి రోజూ కొటేషన్స్ పెడుతూ ఉంటాడు.  ‘నేను ఎందుకు ఈ బాధలు పడాలి? నేను ట్రాఫిక్‌లో ఇరుక్కోవాలి? నేను ఎందుకు పనిచేయాలి? నేను ఎందుకు యుద్ధాలు చేయాలి? నేను ఎందుకు బాధలు పడాలి? నాకు ఇష్టం లేకుండా, అవసరం లేకుండా ఏదైనా ఎందుకు చేయాలి? అనేక ప్రశ్నలకు ఒక్కటే సమాధానం: ఎవరో తమ సుఖం కోసమే నిన్ను కన్నారు...’’ అంటూ శామ్యూల్ తన ఫేస్‌బుక్ పేజీలో రాసుకున్నాడు.

click me!