వాంటెడ్ క్రిమినల్ అరెస్టు..బంగారం, నగదు స్వాధీనం

By telugu teamFirst Published May 30, 2019, 11:09 AM IST
Highlights

పలువురి ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడి బంగారం, నగదు దోచుకువెళ్లి.. పోలీసులకు దొరకకుండా పారిపోతున్న వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులకు పట్టుకున్నారు.

పలువురి ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడి బంగారం, నగదు దోచుకువెళ్లి.. పోలీసులకు దొరకకుండా పారిపోతున్న వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులకు పట్టుకున్నారు. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా నల్లసోపర ప్రాంతానికి  చెందిన దినేష్ యాదవ్(30) అనే యువకుడు గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

అతని పేరిట 15 దొంగతనం కేసులు నమోదయ్యాయి. కాగా... అతని కోసం ఎప్పటి నుంచో గాలిస్తున్న పోలీసులు ఎట్టకేలకు అతనిని థానేలో పట్టుకోగలిగారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ ఇంటి తాళాలు పగలగొట్టి మరీ లోపలికి ప్రవేశించి.. డబ్బు, బంగారం దోచుకువెళ్లేవాడు. దాదాపు ఈ దొంగతనాలన్నీ... ముంబయి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చేసేవాడు. కాగా... పోలీసులు అతని వద్ద నుంచి 76గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2.28లక్షలుగా తేల్చారు. మిగిలిన సొమ్మును కూడా రికవరీ చేస్తామని చెప్పారు. నిందితుడి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు చెప్పారు. 

click me!