కట్టుకున్నభార్య, సొంత కూతురి కిడ్నాప్.. అడ్డొచ్చారని అత్తామామలను చితగ్గొటి, కారుతో గుద్ది చంపాలని చూసి..

Published : Feb 06, 2023, 11:19 AM IST
కట్టుకున్నభార్య, సొంత కూతురి కిడ్నాప్.. అడ్డొచ్చారని అత్తామామలను చితగ్గొటి, కారుతో గుద్ది చంపాలని చూసి..

సారాంశం

విడాకులు అడిగిందని భార్యను, కూతుర్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడో వ్యక్తి. అడ్డొచ్చిన అత్తామామల్ని చితక్కొట్టాడు. మామ మీదికి కారు తోలించి చంపాలని ప్రయత్నించాడు. 

హర్యానా : ఓ వ్యక్తి తన భార్య సొంత కూతురునే కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన షాకింగ్ ఘటన హర్యానాలో వెలుగు చూసింది.  అత్తమామల ఇంట్లోకి ప్రవేశించి కత్తులు, కర్రలతో కొట్టి.. కూతురిని,  భార్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు. ఇది వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం చెలరేగింది. కాసేపటికి తేరుకున్న అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. ఘటన స్థలికి చేరుకుని పరిశీలించిన తర్వాత విచారణ ప్రారంభించారు. 

దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే..   మూడు సంవత్సరాల క్రితం పాయల్ అనే హర్యానాలోని భగత్ సింగ్ కాలనీకి చెందిన యువతికి ప్రవీణ్ అనే వ్యక్తితో వివాహమయ్యింది. వీరికి ఓ కూతురు పుట్టింది. ఆమె పేరు రిద్ధి. ఆ తర్వాత కొంతకాలానికి ప్రవీణ్, పాయల్ ల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో వీరిద్దరూ విడాకుల వరకు వెళ్లారు. ఈ కేసు కోర్టులో  నడుస్తోంది. త్వరలోనే వీరి వీడాకుల కేసు విచారణకు రానుంది.

వైజాగ్ టు సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో నాణ్యత లేని ఆహారం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం 15మందితో కలిసి ప్రవీణ్ పాయల్ ఇంట్లోకి బలవంతంగా చొచ్చుకొచ్చాడు. ప్రవీణ్ తో పాటు వచ్చిన అందరి చేతుల్లోనూ కత్తులు, కర్రలు ఉన్నాయి, . వీరు రావడంతోనే పాయల్ ను, రిద్దీని బలవంతంగా తీసుకు వెళ్ళడానికి ప్రయత్నించారు. అది గమనించిన పాయల్ తల్లిదండ్రులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రవీణ్, అతని అనుచరులు అత్తమామలను చితకొట్టారు.  పాయల్ తండ్రిని రోడ్డుపైకి ఈడ్చి.. అతని మీద నుంచి కారును తోలి చంపాలని ప్రయత్నించారు. 

తృటిలో అతడు ప్రాణాప్రాయం నుంచి  తప్పించుకున్నాడు.  వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు ప్రవీణ్ అతనితోపాటు వచ్చిన మరో 15మందిపై, దాడి,  హత్యాయత్నం, కిడ్నాప్ తో సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu