ఛీ.. వీడు మనిషేనా.. భార్యతో గొడవపడి.. యేడాది వయసున్న కూతుర్ని వ్యవసాయ బావిలోకి విసిరేసిన తండ్రి..

Published : Sep 29, 2022, 11:22 AM IST
ఛీ.. వీడు మనిషేనా.. భార్యతో గొడవపడి.. యేడాది వయసున్న కూతుర్ని వ్యవసాయ బావిలోకి విసిరేసిన తండ్రి..

సారాంశం

భార్యతో గొడవపడి..కోపంలో యేడాది వయసున్న చిన్నారిని వ్యవసాయ బావిలోకి తోసేశాడో కఠినాత్ముడు. ఈ ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది. 

మహారాష్ట్ర : మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టరాని కోపంలో విచక్షణ కోల్పోయి.. ఓ వ్యక్తి చేసిన పని చివరికి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. 30 ఏళ్ల ఓ వ్యవసాయ కూలీ తన భార్యతో గొడవపడి.. ఆ  కోపంతో తమ ఏడాదిన్నర కుమార్తెను వ్యవసాయ బావిలోకి విసిరేశాడు. దీంతో శిశువు మృతి చెందింది. ఈ ఘటన బుధవారం నాడు చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. 

జాల్నా తహసీల్‌లోని నిధినా గ్రామంలో బుధవారం ఉదయం ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. జగన్నాథ్ ధాక్నే అనే సదరు నిందితుడిని ఆ తర్వాత అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఔరంగాబాద్ జిల్లాలోని సిల్లోడ్ నుంచి రెండు నెలల క్రితం ధాక్నే తన భార్య, నెలల వయసున్న కుమార్తెతో కలిసి పొలంలోపని చేసేందుకు జల్నాకు వచ్చాడు. కాగా బుధవారం ఉదయం భార్యభర్తల మధ్య ఏదో విషయంగా గొడవ చెలరేగింది. ఇది వాగ్వాదంగా మారింది. 

ప్రేమించి పెళ్లిచేసుకున్న ఆర్నెళ్లకు.. తాను రెండో భార్య అని తెలియడంతో.. నవవధువు ఆత్మహత్య..

దీంతో భర్త తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. విచక్షణ కోల్పోయాడు. భార్య మీది కోపంతో ఊయలలో నిద్రిస్తున్న పసికందును తీసుకెళ్లి సమీపంలోని వ్యవసాయ బావిలో పడేశాడు. ఈ విషయం భార్యకు తెలియదు. అయితే ఆ తరువాత కూతురు కనిపించడం లేదన్న విసయం గుర్తించిన భార్య.. అంతటా వెతికినా ఫలితం లేకపోయింది. చిన్నారిని చెరువులో పడేసిన విషయం చెప్పకుండా భర్త కూడా ఆమెతో కలిసి ఏమీ తెలియనట్టు వెతకడం ప్రారంభించాడు. 

ఎంతకీ పాప ఆచూకీ దొరకకపోవడంతో.. పాప కనిపించడంలేదంటూ చందంజీరా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి కంప్టైంట్ తో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ సమయంలో తండ్రి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతో కాస్త గట్టిగా ప్రశ్నించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్యమీద కోపంతో చిన్నారిని అతనే హత్య చేసి.. మిస్సింగ్ డ్రామా ఆడినట్లు తేలింది. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరం తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు  ధాక్నేపై హత్య కేసు నమోదు చేశారు. కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

తమ కూతురిని భర్తే చంపాడని తెలియడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా రోధిస్తోంది. ఈ ఘటన స్తానికంగా కలకలం రేపింది. క్షణికావేశంలో తండ్రి చేసిన పని అభం, శుభం తెలియని ఆ చిన్నారి ఉసురు తీసింది. అతడిని నేరస్తుడిగా మార్చింది. తల్లిని అనాథను చేసింది. 

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?