ప్రేమించి పెళ్లిచేసుకున్న ఆర్నెళ్లకు.. తాను రెండో భార్య అని తెలియడంతో.. నవవధువు ఆత్మహత్య..

Published : Sep 29, 2022, 10:46 AM IST
ప్రేమించి పెళ్లిచేసుకున్న ఆర్నెళ్లకు.. తాను రెండో భార్య అని తెలియడంతో.. నవవధువు ఆత్మహత్య..

సారాంశం

ప్రేమించి, ఇంట్లోనుంచి పారిపోయి పెళ్లిచేసుకున్న యువతికి.. పెళ్లైన ఆరునెలల తరువాత తాను రెండో భార్య అనే విషయం తెలిసింది. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. 

బెంగళూరు : బెంగళూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లైన ఓ అమ్మాయికి తాను.. తన భర్తకు రెండో భార్య అని తెలియడంతో తీవ్రమనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. గౌతమి  అనే 24 ఏళ్ల నవ వధువు మంగళవారం మారతహళ్లిలోని కావేరీ లేఅవుట్‌లో తన అద్దె ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అర్ధరాత్రి దాటిన తరువాత  తెల్లవారుజామున 4 గంటల మధ్య ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 

భర్త రెడ్డి ప్రసాద్ ఉదయం లేచి చూసేసరికి భార్య మృతదేహం కనిపించింది. గౌతమి తండ్రి ఎ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారతహళ్లి పోలీసులు ప్రసాద్‌, అతని మొదటి భార్య ఆయుషా బానుపై కేసు నమోదు చేశారు. గౌతమి బికామ్‌ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్‌లోని పుంగనూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తోందని బాబు పోలీసులకు తెలిపాడు. తమ పక్క గ్రామం దిన్నిపల్లికి చెందిన ప్రసాద్‌తో ప్రేమలో పడి.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన పెళ్లి చేసుకుందని సమాచారం.

కండోమ్ లు కూడా కావాలా?.. శానిటరీ పాడ్స్ గురించి అడిగిన బాలికలతో మహిళా ఐఏఎస్ దురుసు ప్రవర్తన..

వీరిద్దరూ మార్చి 19, 2022న వివాహం చేసుకున్నారు. కూతురు కనిపించకపోవడంతో గౌతమి తండ్రి బాబు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేశాడు. ఆ తరువాత ఆమె పోలీసుల ముందు ప్రత్యక్షమయ్యింది. తాను ఇష్టపూర్వకంగానే ఇంట్లోంచి వెళ్లిపోయానని.. తను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకున్నానని తెలియజేసింది. ఆ తర్వాత దంపతులు బెంగళూరుకు మకాం మార్చారు.

ప్రసాద్‌కి అంతకు ముందే పెళ్లయిందని.. బాను అనే భార్య,  ఒక కూతురు ఉందని గౌతమికి తెలిసిందని బాబు ఆరోపించారు. మంగళవారం మొదటి భార్య బాను ఇంటికి వచ్చిందని గౌతమి బాబుకు ఫోన్ చేసి చెప్పింది. ఇదివరకే పెళ్లి అయినా తననెందుకు మోసం చేశావని ఆమె ప్రశ్నించగా.. ప్రసాద్, బాను ఇద్దరూ ఆమెను ఇష్టానుసారం తిట్టారని, వేదించారని తెలిపిందని చెప్పుకొచ్చాడు.  

PREV
click me!

Recommended Stories

Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM