నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్‌ లను చంపుతానన్న బెదిరింపు కాల్.. వ్యక్తి అరెస్ట్

By SumaBala Bukka  |  First Published Nov 21, 2023, 12:51 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేయాలని దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ చెప్పినట్లు నిందితులు పేర్కొన్నారు. 


ముంబై : దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ పేరుతో ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు కాల్స్ చేసినందుకు ఒక వ్యక్తిని నవంబర్ 21, మంగళవారం అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేయాలని దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ చెప్పినట్లు నిందితులు పేర్కొన్నారు. "జేజే హాస్పిటల్‌ను పేల్చివేస్తానని కూడా కాల్ చేసిన వ్యక్తి బెదిరించాడు. ఐపీసీ u/s 505 (2) కేసు నమోదు చేశాం" అని ముంబై పోలీసు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, అక్టోబర్ 6, ముంబై పోలీసులకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద ముఠాలతో ప్రేరేపితమైన ఓ బెదిరింపు కాల్ వచ్చింది. ఈ విషయం శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది.  గోరేగావ్‌కు చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో తాను పాకిస్థానీ అని పేర్కొంటూ, నగరంలో త్వరలో బాంబు దాడులు జరగనున్నాయని హెచ్చరిస్తూ పోలీసు కంట్రోల్ రూమ్‌కు కాల్ చేశాడు. 30 ఏళ్ల కార్మికుడైన నాగేంద్ర శుక్లాగా గుర్తించబడిన ఈ కాలర్, పాకిస్తానీయురాలైన సీమా హైదర్‌తో కలిసి రెండు డజన్ల మంది వ్యక్తి భారతదేశంలోకి చొరబడ్డారని, గంటల్లో పేలుళ్లకు పాల్పడడానికి యోచిస్తున్నట్లు తెలిపాడు.

Latest Videos

ఈ కాల్ లో వెంటనే అప్రమత్తమైన పోలీసు బలగాలు.. వేగంగా ప్రతిస్పందించారు. అక్టోబరు 7, శనివారం నాడు శుక్లాను ట్రాక్ చేసి పట్టుకునే వరకు ఒకే వ్యక్తి నుండి అనేక కాల్‌లు వచ్చాయి. అతని భయంకరమైన ప్రకటనలు, కాల్స్ ఒక ప్రాంక్ అని, పోలీసులపై విపరీతమైన ఒత్తిడి కలిగించడానికే చేసిందని తేలింది. 

 

Mumbai Police say, "A man arrested for placing threat calls at Mumbai Police Control Room in the name of Dawood Ibrahim gang. The man had claimed that the gang had told him to blow up PM Modi and UP CM Yogi Adityanath. The caller had also threatened to blow up JJ Hospital. Case…

— ANI (@ANI)
click me!