‘పీవీఆర్ సినిమా’ వాష్‌రూమ్‌లో మృతదేహం.. ఆత్మహత్యగా అనుమానం

Published : Jul 08, 2022, 08:07 PM IST
‘పీవీఆర్ సినిమా’ వాష్‌రూమ్‌లో మృతదేహం.. ఆత్మహత్యగా అనుమానం

సారాంశం

ఢిల్లీలోని ఓ పీవీఆర్ సినిమాకు చెందిన వాష్‌రూమ్‌లో డెడ్ బాడీ కనిపించింది. పోలీసులు ఆ మృతదేహాన్ని రికవరీ చేసుకున్నారు. ఆ వ్యక్తి వాష్‌రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  

న్యూఢిల్లీ: దేశ రాాజధాని ఢిల్లీలో ఓ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి పీవీఆర్ సినిమాలో ఆత్మహత్య చేసుకున్నాడు. దక్షిణ ఢిల్లీలో వికాస్‌పురిలోని పీవీఆర్ సినిమా‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పీవీఆర్ సినిమాకు చెందిన ఓ వాష్‌రూమ్‌లో శుక్రవారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. 

వాష్‌రూమ్‌లో ఓ వ్యక్తి డెడ్ బాడీ కనిపించింది. దీంతో విషయం పోలీసులకు చెప్పారు. పోలీసులు ఆ డెడ్ బాడీని రికవరీ చేసుకున్నారు. ఆ వ్యక్తి పాకెట్‌లో ఆధార్ కార్డు లభించింది. ఈ ఆధార్ కార్డు ఆధారంగానే మృతి చెందిన వ్యక్తిని గుర్తించారు. ఆయనకు సుమారు 44 ఏళ్లు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. 

ఆయన ఆత్మహత్యకు కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. ఆ వ్యక్తి ఒక పదునైన ఆయుధంతో గాయపరుచుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, తాము కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం