ముంచెత్తిన వరద.. అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్

Siva Kodati |  
Published : Jul 08, 2022, 08:07 PM IST
ముంచెత్తిన వరద.. అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్

సారాంశం

ప్రఖ్యాత అమర్ నాథ్ యాత్రను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. శుక్రవారం అమర్ నాథ్ గుహ పరిసరాల్లోకి భారీగా వరద నీరు పోటెత్తింది. ఈ ఘటనలో ఇప్పటికు వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా... దాదాపు 12 వేల మంది భక్తులు వరదల్లో చిక్కుకుపోయారు. 

ప్రఖ్యాత అమర్ నాథ్ యాత్రను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. శుక్రవారం అమర్ నాథ్ గుహ పరిసరాల్లోకి భారీగా వరద నీరు పోటెత్తింది. ఈ ఘటనలో ఇప్పటికు వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా... దాదాపు 12 వేల మంది భక్తులు వరదల్లో చిక్కుకుపోయారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

కాగా.. నిన్న సాయంత్రం నుంచి అమర్ నాథ్ పరిసర ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షం కారణంగా శుక్రవారం ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఈ ఘటనలో యాత్రికుల గుడారాలు కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా వరద ముంచుకురావడంతో భారీగా యాత్రికులు కొట్టుకుపోయారు. వీరి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 

ఇకపోతే.. జూన్ 30న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొత్తం 43 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ఆగస్టు 11న రక్షా బంధన్ రోజున అమర్ నాథ్ యాత్ర ముగియనుంది. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి యాత్ర సాగడం లేదు. చివరిసారిగా 2019 జూలై 1 నుంచి ఆగస్టు 1 వరకు యాత్ర జరిగింది. అప్పుడు 3.42 లక్షల మంది భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఒక్క మాటతో సగానికి తగ్గిన హాస్పిటల్ బిల్లు.. అసలు ట్రిక్ ఇదే
ఏమిటీ.. తీర్థయాత్రకు వెళితే లక్ష రూపాయలు ఇస్తారా..!