మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండేకి రెండోసారి కరోనా పాజిటివ్

By telugu teamFirst Published Mar 24, 2021, 8:30 AM IST
Highlights

మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండేకు రెండోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్ర మంత్రి, సీఎం ఉద్ధవ్ థాకరే తనయుడు ఆదిత్య ఠాకరేకు మూడు రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది.

ముంబై: మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండేకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఎన్సీపీకి చెందిన ఆయనకు కోవిడ్ 19 సోకడం ఇది రెండోసారి. నిరుడు జులైలో ఆయనకు మొదటిసారి కరోనా వైరస్ పాజటివ్ నిర్ధారణ అయింది. 

రెండోసారి తనకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయిందని, గత కొద్ది రోజులుగా తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నానని, అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, సామాజిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తగా మసలుకోవాలని ఆయన మరాఠీలో ట్వీట్ చేశారు. 

తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని మహారాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య ఠాకరే కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఆయన ఈ విషయాన్ని ప్రకటించిన మూడు రోజులకే ధనంజయ్ ముండేకు కరోనా వైరస్ సోకింది. 

తనకు కోవిడ్ లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకున్నానని, తనకు కోవిడ్ 19 ఉన్నట్లు నిర్ధారణ అయిందని, తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవాలని, కోవిడ్ ప్రోటోకాల్ పాటించి, సురక్షితంగా ఉండాలని ఆదిత్య ఠాకరే ట్వీట్ చేశారు. 

మహారాష్ట్రలో పెద్ద యెత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 28,699 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 13,165 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 132 మంది మరణించారు. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంగళవారంనాడు ప్రకటించింది. 

click me!