బీరు తాగించలేదని ఫ్రెండ్‌ను కత్తితో పొడిచాడు.. ఎక్కడంటే?

Published : Aug 08, 2022, 01:21 PM IST
బీరు తాగించలేదని ఫ్రెండ్‌ను కత్తితో పొడిచాడు.. ఎక్కడంటే?

సారాంశం

ఓ ఫ్రెండ్.. తనకు బీరు తాగించట్లేదని బెంగళూరు వాసి సీరియస్ అయ్యాడు. కత్తితో ఫ్రెండ్ పైనే దాడికి దిగాడు. కత్తితో పొడిచేశాడు. ఆ ఫ్రెండ్ అరుపులు పెట్టగా స్థానికులు అక్కడికి వచ్చారు. అంతలోపే నిందితుడు పరారయ్యాడు.  

బెంగళూరు: నేటి యువత జల్సాలో తప్పకుండా బీర్లు భాగం అయిపోయాయి. పార్టీ చేసుకోవాలంటే.. బీరు తప్పనిసరి పానీయంగా మారిపపోయింది. కానీ, ఈ మత్తులో వారు అఘాయిత్యాలకూ పాల్పడుతున్నారు. కర్ణాటకలోని ఓ చోట బీరు తాగించలేదని ఫ్రెండ్‌నే కత్తితో పొడిచేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది.

23 ఏళ్ల రాఘవేంద్ర, బాబాజాన్‌లు క్లోజ్ ఫ్రెండ్స్. బెంగళూరులో వారు ఏ పని దొరికితే ఆ పని చేసేవారు. ఆగస్టు 4వ తేదీన గురువారం వారు పార్టీ చేసుకున్నారు. బాబాజాన్ మూడు బీర్లు కొన్నాడు. ఇద్దరూ కలిసి తాగారు. ఆ తర్వాత వారు రాఘవేంద్ర ఇంటికి వెళ్లారు. రాఘవేంద్ర ఇంటిలో వారిద్దరూ లేట్ నైట్ వరకు పార్టీ చేసుకున్నారు. 

బీర్లు అయిపోయిన తర్వాత రాఘవేంద్ర తనకు ఇంకా బీర్లు కావాలని పట్టుబట్టారు. ఆ బీర్లు కూడా బాబాజానే కొని తీసుకురావాలని డిమాండ్ పెట్టాడు. కానీ, తన దగ్గర డబ్బులు లేవని బాబాజాన్.. మెల్లగా రాఘవేంద్రకు చెప్పాడు. డబ్బులు లేవని బాబాజాన్ చెప్పడంతో రాఘవేంద్ర సీరియస్ అయ్యాడు. బాబాజాన్‌ను తీవ్రంగా దూషించాడు. 

ఆ తర్వాత రాఘవేంద్ర ఓ కత్తి తీసుకుని బాబాజాన్‌ను పొడవడానికి ప్రయత్నించాడు. కానీ, బాధితుడు బాబాజాన్ రాఘవేంద్ర ప్రయత్నాన్ని చాకచక్యంగా తప్పించుకున్నాడు. కానీ, బాబాజాన్ ఎడమ తొడపై రాఘవేంద్ర వేటు వేశాడు. కత్తి పట్టి తనపై రాఘవేంద్ర దాడికి రాగానే బాబాజాన్ ఒక్కసారిగా భయంతో అరుపులు వేశాడు. తన ఎడమ తొడపై వేటు పడగానే స్థానికులు అక్కడకు వస్తున్నారు. స్థానికులు స్పాట్‌కు వస్తున్నారని గమనించిన నిందితుడు రాఘవేంద్ర అక్కడి నుంచి పారిపోయినట్టు బ్యాప్పనహల్లి పోలీసులు తెలిపారు. 

బ్యాప్పనపల్లి రాఘవేంద్రపై హత్యా నేరం కింద కేసు పెట్టారు. ప్రస్తుతం రాఘవేంద్రను పట్టుకోవడానికి పోలీసులు గాలింపులు జరుపుతున్నారు.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu