ఫోన్ రిపేర్ చేయడానికి రూ. 500 అడిగాడని.. కత్తితో పొడిచి హత్య..

Published : Feb 11, 2023, 07:34 AM IST
ఫోన్ రిపేర్ చేయడానికి రూ. 500 అడిగాడని.. కత్తితో పొడిచి హత్య..

సారాంశం

ఫోన్ రిపేర్ కోసం ఇవ్వాల్సిన రూ.500ఇవ్వమని అడిగినందుకు ఓ వ్యక్తిని ఇద్దరు అన్నాదమ్ములు కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. 

ముంబై : మహారాష్ట్రలోని ముంబైలో క్షణికావేశంలో ఓ హత్య జరిగింది. రూ. 500 కోసం చెలరేగిన గొడవ చివరికి ఒకరి ప్రాణాలు తీయడంతో ముగిసింది. ఓ వ్యక్తి ఫోన్ తీసుకుని తెలిసిన వ్యక్తులు పాడు చేశాడు. దీంతో అతను ఫోన్ రిపేర్ కోసం డబ్బులు అడిగాడు. ఆ క్రమంలోనే గొడవ చెలరేగి ఇద్దరు సోదరులు 25 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన ఘటన సబర్బన్ బాంద్రాలో శుక్రవారం జరిగింది. 

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు ఇలా తెలిపారు. ఈ సంఘటన గురువారం రాత్రి బాంద్రా రైల్వే స్టేషన్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి క్రింద జరిగింది. బాధితుడిని నజీమ్ ఇఫ్తికర్ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులు అతనికి తెలిసిన వారేనని, పోలీసులు ఆ ఇద్దరు నిందితులను అరెస్టు చేశారని ఒక అధికారి తెలిపారు.

వివరాల ప్రకారం, ఖాన్, ఇద్దరు నిందితులు బాంద్రా (తూర్పు)లోని గరీబ్ నగర్‌లో నివసిస్తున్నారు. నిందితులలో ఒకరు ఖాన్ మొబైల్ ఫోన్‌ను పాడు చేసాడు, దాని కోసం అతను దానిని రిపేర్ చేయడానికి అతని నుండి రూ.1,000 డిమాండ్ చేశాడు. దీనికి ఒప్పుకున్న ఇద్దరూ ఖాన్ భార్యకు రూ. 500 ఇచ్చారు. మిగిలిన డబ్బును 12 గంటలలోపు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే, మిగిలిన మొత్తాన్ని ఖాన్ అక్కడికక్కడే డిమాండ్ చేయడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది.

ఈ గొడవ ఘర్షణగా మారడంతో నిందితులలో ఒకరు కత్తిని తీసి ఖాన్ ఛాతీపై పొడిచాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనిస్తున్న వారు.. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడికి చేరుకునే క్రమంలోనే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

షాకింగ్.. ఆన్లైన్ లో బ్రెడ్ ఆర్డర్ చేస్తే.. ఎలుక ప్రత్యేక్షం..

ఇదిలా ఉండగా, బీహార్‌లోని కతిహార్ జిల్లాలో బుధవారం ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్‌ హత్యకు గురయ్యింది. ఇంటికి తిరిగి వస్తున్న మహిళా పోలీసు కానిస్టేబుల్‌పై కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటన కతిహార్ జిల్లా సమీపంలోని భట్వారా పంచాయతీ భవన్ సమీపంలో ఎన్ హెచ్ 81లో రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగింది. ఆ మహిళ ముంగేర్ జిల్లా వాసి.

ఘటనా స్థలం నుంచి రెండు ఖాళీ కాట్రిడ్జ్‌లు, మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. బైక్‌పై వెళ్తున్న మహిళను మోటార్‌సైకిల్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మహిళను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

“మేము ఇంకా దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉన్నాం. దీనిపై విచారణ జరుపుతాం' అని కతిహార్‌ ఎస్పీ జితేంద్ర కుమార్‌ తెలిపారు. డాగ్ స్క్వాడ్‌తో పాటు ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని కేసుకు సంబంధించిన వివరాలు సేకరించినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని కూడా కతిహార్‌కు పంపినట్లు అధికారి తెలిపారు.

మృతురాలు ప్రభకుమారి అనే మహిళా కానిస్టేబుల్ తన తల్లిదండ్రులతో కలిసి భట్వారా గ్రామంలో ఉంటోంది. కాగా, ప్రభకుమారికి చోటు అలియాస్ అర్షద్ అనే వ్యక్తితో ప్రేమవ్యవహారం ఉండేది. అయితే, గత కొద్ది రోజులగా ప్రభకుమారి అర్షద్ ను దూరం పెడుతోంది. దీంతో కోపానికి వచ్చిన అతను ఆమెను చంపేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. చాలాసార్లు ఫోన్లు చేసి ఈ మేరకు బెదిరింపులకు పాల్పడ్డాడని ప్రభకుమారి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ప్రభకుమారిని హత్య చేశాడని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?