షాకింగ్.. ఆన్లైన్ లో బ్రెడ్ ఆర్డర్ చేస్తే.. ఎలుక ప్రత్యేక్షం..

Published : Feb 11, 2023, 07:25 AM IST
షాకింగ్.. ఆన్లైన్ లో బ్రెడ్ ఆర్డర్ చేస్తే.. ఎలుక ప్రత్యేక్షం..

సారాంశం

ఓ వ్య‌క్తి బ్రెడ్ కోసం బ్లింకిట్‌లో ఆర్డ‌ర్ ఇవ్వ‌గా బ్రెడ్ ప్యాకెట్‌లో ఎలుక క‌నిపించ‌డంతో షాక్ తిన్నాడు. తాను బ్లింకిట్‌లో బ్రెడ్ ఆర్డ‌ర్ చేస్తే తన‌కు డెలివ‌రీ యాప్ ఎలాంటి షాక్ ఇచ్చింద‌నే వివ‌రాల‌ను తన ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. 

ప్రస్తుతం మార్కెట్ కెళ్లి.. కిరాణా సామాగ్రిని కొనుగోలు చేయడం, లేదా మనమే మార్కెట్ కెళ్లి.. ఇతర వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలనే టెన్షన్‌ లేకుండా పోయింది. తీరికగా ఇంట్లో కూర్చోని.. Blinkit, Swiggy Instamart, Zepto, లాంటి మరెన్నో యాప్‌లను ఉపయోగించి .. నచ్చిన వంటకాన్ని లేదా కూరగాయలను సరసమైన ధరల్లో .. మార్కెట్‌లోని దుకాణదారులతో బేరసారాలు చేయకూడదనే తెచ్చుకోవచ్చు.  అయితే.. ఈ యాప్ లతో కొన్ని సార్లు.. తలనొప్పలూ ఎదురవుతుంటాయి. యాప్ నిర్వాకుల అజాగ్రత్త వల్ల.. వస్తువులు తారుమారు కావడం.. లేదా నాసిరకం వస్తువులు రావడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తునే ఉంటాయి. 

తాజాగా.. ఓ వ్యక్తికి ఎదురైన అనుభవాన్ని చూస్తే.. డెలివరీ యాప్‌లో వస్తువులను ఆర్డర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా చేస్తుంది. వివరాల్లోకెళ్లే.. నితిన్ అరోరా అనే వ్యక్తి బ్రెడ్ కోసం బ్లింకిట్ లో ఆర్డర్ చేశారు. అనుకున్న సమయంలోనే ఆర్డర్ వచ్చి.. తీరా ఆర్డర్ చూసే సరికి కంగుతిన్నాడు. ఆ బ్రెడ్ ప్యాకెట్‌లో ఎలుక క‌నిపించ‌డంతో దిమ్మతిగిరినట్టు అయ్యింది.

తాను బ్లింకిట్‌లో బ్రెడ్ ఆర్డ‌ర్ చేస్తే తన‌కు డెలివ‌రీ యాప్ ఎలాంటి షాక్ ఇచ్చిందనే వివరాలను తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తనకు డెలివరీ అయిన.. బ్రెడ్ ప్యాకెట్ లో ఎలుక స‌జీవంగా ఉంద‌ని రాసుకొచ్చాడు. బ్లింకిట్‌తో తనకు ఎదురైన చేదు అనుభ‌వాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అసలు ఎలుక ప్యాకెట్‌లో ఎలా ఇరుక్కుపోయిందో ఆశ్చర్యకరంగా ఉందని, ఆర్డర్‌ను ప్యాక్ చేస్తున్న వ్యక్తికి గానీ, డెలివరీ ఏజెంట్ గానీ ఎలుక ఉనికిని గుర్తించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని పేర్కోన్నారు.  

“@letsblinkitతో అత్యంత అసహ్యకరమైన అనుభవం, 1.2.23న ఆర్డర్ చేసిన బ్రెడ్ ప్యాకెట్‌లో ఎలుక డెలివరీ చేయబడింది. ఇది మనందరికీ ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి ప్యాక్ వేగంగా తీసుకువ‌చ్చేందుకు బ‌దులు స‌రైన డెలివ‌రీ కోసం ఎన్ని గంట‌లైనా ఎదురుచూసేవాడిన‌ని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఘ‌ట‌న‌పై కంపెనీ కామెంట్స్ సెక్ష‌న్‌లో స్పందించింది. హాయ్ నితిన్ మీకు ఇలాంటి అసౌక‌ర్యం క‌లగాల‌ని తాము కోరుకోలేద‌ని..మీ రిజిస్ట‌ర్డ్ కాంటాక్ట్ నెంబ‌ర్ లేదా ఆర్డ‌ర్ ఐడీ పంపితే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని బ‌దులిచ్చింది.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?