రెస్టారెంట్ లో హేమంత్ దారుణ హత్య

Published : Nov 30, 2018, 11:07 AM IST
రెస్టారెంట్ లో హేమంత్  దారుణ హత్య

సారాంశం

గురువారం సాయంత్రం 6గంటల సమయంలో  అతనిని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపేశారు

రెస్టారెంట్ లో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. రెస్టారెంట్ లో పనిచేస్తున్న యువకుడిని గుర్తు తెలియిని వ్యక్తులు కత్తితో పొడిచి హత్య చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... దక్షిణ ఢిల్లీలోని నుక్కద్వాలా అనే టాప్ రెస్టారెంట్ ఉంది. అందులో హేమంత్ అనే యువకుడు కొంతకాలంగా పనిచేస్తున్నాడు. కాగా.. గురువారం సాయంత్రం 6గంటల సమయంలో  అతనిని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రెస్టారెంట్ కి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

కాగా.. హేమంత్ తోపాటు పనిచేసే స్టాఫే  తమ కుమారుడిని హత్య చేసి ఉంటారని హేమంత్ తండ్రి ఆరోపిస్తున్నారు. ఎంత అడిగినా.. హత్య గురించి పోలీసులు ఏమీ చెప్పడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రెస్టారెంట్ లోపల, బయట మోత్తం సీసీటీవీ కెమేరాలు ఉన్నాయని.. వాటి ద్వారా తమ సోదరుడిని  చంపింది ఎవరో తెలుస్తుందని హేమంత్ సోదరుడు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !