Teacher Recruitment Scam : వెక్కివెక్కి ఏడ్చిన అర్పితా ముఖర్జి.. ఆస్పత్రిలో హై డ్రామా...

Published : Jul 30, 2022, 09:05 AM IST
Teacher Recruitment Scam : వెక్కివెక్కి ఏడ్చిన అర్పితా ముఖర్జి.. ఆస్పత్రిలో హై డ్రామా...

సారాంశం

టీచర్ రిక్రూట్ మెంట్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్థ ఛటర్జీ సహాయకురాలు అర్పితా ముఖర్జీని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ ఆమె వెక్కి వెక్కి ఏడ్చారు.

కలకత్తా : పశ్చిమ బెంగాల్ లో టీచర్ పోస్టుల భర్తీ కుంభకోణంలో మంత్రి పార్థ ఛటర్జీ సహాయకురాలు అర్పితా ముఖర్జీని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకు వచ్చిన సందర్భంగా ఆమె వెక్కివెక్కి ఏడ్చారు. కారులోంచి దిగను అంటూ ఆమె మొదట మారాం చేశారు. చివరకు మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా కారులో నుంచి కిందికి దించారు. అయితే ఆమె అక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసు సిబ్బంది ఆమెను వీల్ చైర్ లో ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె వెక్కివెక్కి ఏడ్చారు. ఆ తర్వాత ఆమె ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.  

మరోవైపు ఇదే ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన మంత్రి పార్థ చటర్జీ తనపై  కుట్ర జరిగిందని ఆరోపించారు.మరోవైపు మాజీ మంత్రి పదవి నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు ఆయనను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తొలగించారు. అటు Arpita mukherjee ఫ్లాట్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడుల్లో ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయలకు పైగా అక్రమ నగదు బయటపడింది. ఐదు కిలోల బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు అర్పితా ముఖర్జీకి చెందిన నాలుగు కార్లు అదృశ్యమయ్యాయి. ఆ కార్ల నిండా నోట్లకట్టలు ఉన్నాయని సమాచారం. అధికారులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

Bengal SSC Scam : అర్పితా ముఖర్జీ ఫ్లాట్ లో సెక్స్ టాయ్స్, వెండి గిన్నెలు ల‌భ్యం.. షాక్ అయిన అధికారులు

ఇదిలా ఉండగా, టీచర్ రిక్రూట్మెంట్ స్కాంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని కోల్‌కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్‌ఎస్‌కెఎమ్ ఆసుపత్రికి తరలించడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా, ఛటర్జీ ఆసుపత్రిలో డాన్‌లా ప్రవర్తిస్తున్నారని జూలై 25న దర్యాప్తు సంస్థ తెలిపింది. ఛటర్జీ ఆసుపత్రిలో డాన్‌లా ప్రవర్తిస్తున్నారని, ఇడి అధికారులను దుర్భాషలాడుతున్నారని ఈడి పేర్కొంది.

చట్టం నుంచి తప్పించుకునేందుకు ఛటర్జీ అనారోగ్యం కథ అల్లుతున్నారని కలకత్తా హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ బిబేక్ చౌధురితో కూడిన ధర్మాసనానికి ఈడీ తెలిపింది. దర్యాప్తు సంస్థ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్, “ఆయన ఆసుపత్రిలో చేరడంపై దిగువ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ మీద, మాకు విచారణకు ఇవ్వకుండానే ఆర్డర్ జారీ చేయబడిందని, అతనిని క్రమం తప్పకుండా తనిఖీ చేయడానికి. సమీక్ష నిషేధించబడింది, ఎటువంటి అధికార పరిధి లేదు. ఆయనను ఎస్ఎస్ కేఎం హాస్పిటల్ నుంచి ఎయిమ్స్ కు తరలిస్తూ ఆదేశాలివ్వాలి" అని వాదించారు. 

"దయచేసి స్థూల వాస్తవాలను కూడా చూడండి. ఇది అత్యున్నత స్థాయిలో అవినీతి కేసు. అర్హులైన అభ్యర్థుల ప్రాణాలను బలిగొన్నారు. ఇందులో భాగమైన ఒక ఉన్నత మంత్రి. డబ్బును కనుగొనడానికి మేం అతడిని విచారించాలి. మేం అతనిని మొదటి 15 రోజుల్లో మాత్రమే విచారించగలం, కానీ అతను చాలా ప్రభావశీలుడు. అధికార బలం ఉన్న వ్యక్తి. కోల్ కతా ఆస్పత్రిలో రాజుగా చెలరేగి పోతున్నారు. అతను అనారోగ్యం ఉందని నటిస్తున్నాడు, ”అని ఏజెన్సీ కోర్టుకు తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌