అబార్షన్ చేయించుకుందని, ప్రియురాలిని కాల్చి చంపాడు..

Published : May 15, 2023, 10:41 AM ISTUpdated : May 15, 2023, 10:42 AM IST
అబార్షన్ చేయించుకుందని, ప్రియురాలిని కాల్చి చంపాడు..

సారాంశం

తనకు తెలియకుండా అబార్షన్ చేయించుకుందని ఓ వ్యక్తి తన ప్రియురాలిని విచక్షణారహితంగా కాల్చి చంపాడు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్ లో వెలుగు చూసింది. 

టెక్సాస్ : వేరే రాష్ట్రానికి వెళ్లి అబార్షన్ చేయించుకుందని ఓ వ్యక్తి తన ప్రేయసిని కాల్చి చంపాడు, అబార్షన్ అతనికి ఇష్టం లేదని అందుకే ఆమెను చంపాడని పోలీసుల దర్యాప్తులో తేలిసింది. టెక్సాస్‌లో, వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఏర్పడితే తప్ప ఆరు వారాల తర్వాత గర్భస్రావాలు చేయడం చట్టవిరుద్ధం.

డల్లాస్ లోని స్థానిక స్ట్రిప్ మాల్ పార్కింగ్ లో గాబ్రియెల్లా గొంజాలెజ్ (26)అనే తన ప్రేయసిని హెరాల్డ్ థాంప్సన్ (22) కాల్చిచంపాడు. దీనికి గానూ థాంప్సన్ మీద హత్యానేరం మోపబడిందని డల్లాస్ పోలీసులు తెలిపారు. అరెస్ట్ వారెంట్ అఫిడవిట్ ప్రకారం, గర్భంలోని ఏ దశలోనైనా అబార్షన్ అనుమతి ఉన్న కొలరాడో రాష్ట్రంనుంచి ఆ ముందురోజు సాయంత్రమే గొంజాలెజ్ వచ్చింది. అది దాదాపు వారుంటున్న ప్రాంతానికి 800 మైళ్ల దూరంలో ఉంటుంది. 

మోచా బీభత్సం.. మయన్మార్‌ లో ముగ్గురు మృతి.. రఖైన్ ను తాకిన తరువాత బలహీన పడిన సైక్లోన్..

గొంజాలెజ్ కడుపులోని బిడ్డకు “అనుమానితుడే ఆ బిడ్డకు తండ్రి అని నమ్ముతున్నాం” అని అఫిడవిట్‌లో పేర్కొంది. ఘటన జరిగిన పార్కింగ్ స్థలంలోని నిఘా ఫుటేజ్‌లో, థాంప్సన్, గొంజాలెజ్‌ఉదయం 7:30 గంటలకు గొడవ పడుతున్నారు. ఇద్దరూ నడుస్తూ, భుజంపై తోసుకుంటూ.. గొడవ పడుతున్నారు. థాంప్సన్ ఆ సమయంలో తుపాకీని తీసి గొంజాలెజ్ తలపై కాల్చాడు. దీంతో ఆమె నేలపై పడిపోయింది. అయినా కూడా ఆమెను మళ్లీ కాల్చడం కొనసాగించాడని పోలీసులు తెలిపారు.

ఆ తరువాత అతను అక్కడినుంచి పారిపోయాడని వారు తెలిపారు. ఈ కాల్పుల్లో  గొంజాలెజ్ అక్కడికక్కడే మరణించినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. ఈ మార్చిలో థాంప్సన్ ఒక మహిళా కుటుంబ సభ్యుని గొంతు కోసి ఆమెపై దాడి చేసినట్లు అభియోగాలు మోపారు. అయితే, అఫిడవిట్ లో బాధితురాలి పేరు చెప్పనప్పటికీ, ఆమె బహుశా గొంజాలెజ్ అయి ఉంటుందని ఊహాగానాలు వెలువుడుతున్నాయి. 

థాంప్సన్ తో బాధింప బడిన ఆ మహిళ అధికారులకు సమాచారం అందించింది, థాంప్సన్, గొజాలేజ్ రిలేషన్ మొత్తంలో ఆమెను చాలాసార్లు కొట్టాడని వారు చెప్పారు. అంతేకాదు ఆమె కడుపులో బిడ్డ ఉన్న సమయంలో కూడా చాలాసార్లు కొట్టాడని తెలిపారు. బాధితురాలు "అనుమానితుడు తన కుటుంబానికి, పుట్టబోయే పిల్లలకు హాని చేస్తానని తరచూ బెదిరింపులకు పాల్పడినందుకు.. ఆమె భయపడుతోందని’ తెలిసిందని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu