ఇంటిముందు మూత్ర విసర్జన.. వద్దన్నందుకు తుపాకీతో కాల్పులు..ఒకరు మృతి...

By SumaBala BukkaFirst Published Jan 5, 2023, 6:47 AM IST
Highlights

తమ ఇంటిముందు మూత్రవిసర్జన చేస్తున్న వ్యక్తిని అలా చేయొద్దని వారించినందుకు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ మైనర్ మృతి చెందాడు. 

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ లో  దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తి ఇంటి ముందు మూత్రం పోస్తుంటే.. అలా తమ ఇంటికి ముందు చేయొద్దు అన్నందుకు వారిపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. మద్యంమత్తులో ఆ కుటుంబంపై దాడికి దిగాడు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని కోపంతో తుపాకీతో కాల్పులకు దిగాడు. ఈ దారుణమైన ఘటనలో ఆ కుటుంబంలోని ఓ బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో వెలుగు చూసింది.

ఉత్తరప్రదేశ్లోని భింద్ జిల్లాలోని నయాగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట్ గ్రామంలో.. వికాస్, పింటూశర్మ అనే వ్యక్తులు ఉంటున్నారు. పింటూ శర్మ నిత్యం వికాస్ ఇంటి ముందు మూత్ర విసర్జన చేసేవాడు. దీనిమీద వికాస్ అలా చేయద్దని అభ్యంతరం తెలిపాడు. అయినా పింటూ శర్మ వినలేదు. దీంతో మంగళవారం మరోసారి ఇదే విషయంపై  పింటూ శర్మ, వికాస్ ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పింటూ శర్మపై వికాస్ స్థానిక పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేశాడు.

షాకింగ్.. విమానంలో మహిళపై మూత్ర విసర్జన,ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ..అసభ్య ప్రవర్తన.. చివరికి..

ఇది పింటూ శర్మకు నచ్చలేదు. తన మీదే ఫిర్యాదు చేస్తావా అంటూ.. వికాస్ పై కోపానికి వచ్చాడు. మద్యం మత్తులో తన అనుచరులతో కలిసి వికాస్ ఇంటికి వెళ్ళాడు. తనతో తీసుకెళ్లిన తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో వికాస్ ఇంట్లో ఉన్న ముగ్గురు సభ్యులు కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఇంట్లో ఉన్న 12 ఏళ్ల బాలుడు కాల్పులకు మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని.. వారిని ఆస్పత్రికి తరలించారు. నిందితులు ఎవరో తెలియడంతో పింటూ శర్మతో పాటు అతడి అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ మేరకు ఎస్పీ వివరాలు వెల్లడించారు. 

అయితే,  వికాస్ కుటుంబ సభ్యులు నయాగావ్ పోలీసుల తీరుపై మండిపడ్డారు. వారి వ్యవహారాన్ని నిరసిస్తూ.. రోడ్డుమీద ఆందోళనకు దిగారు. ఈ ఘటన జరగడానికి ముందు పింటూ శర్మ తమ ఇంటిముందు మూత్రవిసర్జన చేస్తున్న విషయంలో చాలా సార్లు ఫిర్యాదు చేశామని.. కానీ వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే పింటూ శర్మ రెచ్చి పోయాడని.. ఈ ఘటనకు కారణం ముందుగా పట్టించుకోని పోలీసులు కూడా అని.. ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గొడవ పెద్దది కావడంతో స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగింది.

click me!