
టెస్లా అధినేత ఎలన్ మస్క్.... ఇటీవల ప్రముఖ మైక్రోబ్లాగింగ్ యాప్ ట్విట్టర్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ట్విట్టర్ని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత అందులో ప్రక్షాళన మొదలుపెట్టారు. ముందుగా ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ని తొలగించాడు. ఆ తర్వాత చాలా మంది ఉద్యోగులను తొలగించాడు. ఉన్న ఉద్యోగులకు వీక్ ఆఫ్ లేకుండా రోజుకు 12 గంటలు పని చేయాలంటూ ఆర్డర్స్ కూడా వేశాడు. కాగా.... ఎలన్ మస్క్ ఉద్యోగులను తొలగించిన నిర్ణయం చాలా మందిని బాధ పెట్టింది. సడెన్ గా ఉద్యోగాలు పోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే... ఓ యువకుడు మాత్రం ట్విట్టర్ లో ఉద్యోగం పోయినందుకు చాలా ఆనందపడుతున్నాడు.
నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఎవరైనా సడెన్ గా ఉద్యోగం పోతే జీవితమే కోల్పోయినట్లు ఫీలౌతారు. అయితే.. 25ఏళ్ల యష్ అగర్వాల్ మాత్రం ట్విట్టర్ లో ఉద్యోగం పోయినందుకు సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని తెలియజేశాడు. అతని పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తన ఆనందాన్ని ట్విట్టర్ లోనే పంచుకోవడం విశేషం.
‘‘ఇప్పుడే ఉద్యోగం నుంచి తీసేశారు. బర్డ్ యాప్, ఈ టీమ్‌లో, కల్చర్‌లో భాగం కావడం ఒక గొప్ప అవకాశం, ఎంతో గర్వకారణం. ’’ అని తెలుపుతూ యష్ ట్విటర్‌లో తన పోస్టును షేర్ చేశాడు. కాగా... ఆ పోస్టుకి తన ఫోటోని కూడా షేర్ చేశాడు. అందులో ఒక చేతిలో....ట్విట్టర్ సింబల్ ఉన్న బ్లూ రంగు కుషన్ పట్టుకోగా.... మరో చేతిలో పసుపు రంగు కుషన్ పట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫోటోని షేర్ చేశాడు.
ఉద్యోగం పోయిందని నిరుత్సాహపడకుండా సానుకూల దృక్పథంతో ఉన్న యువకుడిని చూసి నెటిజన్లు ఇంప్రెస్ అవుతున్నారు. సూపర్ అంటూ సదరు యువకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీ కోసం మరింత అద్భుతమైన ఉద్యోగం ఎదురుచూస్తూ ఉంటుంది అంటూ నెటిజన్లు కూడా అతనిలో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తుండటం విశేషం.