ఉద్యోగం పేరుతో టోకరా.. 50 మంది మహిళలను లైంగికంగా వేధించిన కీచకుడు...

By SumaBala BukkaFirst Published Jan 13, 2022, 12:48 PM IST
Highlights

బఘేశ్వర్ కు చెందిన ఈ నిందితుడి పేరు చారు చంద్ర జోషి,  ప్రస్తుతం హల్ద్వానీ డొన్హారియా ఫ్రెండ్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతని మీద ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో చంబల్ వంతెన సమీపంలోని ఓ పార్కు వద్ద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

నైనిటాల్ :  ఉత్తరాఖండ్ లోని Nainital జిల్లాలో 50 మందికి పైగా womenను మోసం చేసిన ఓ కీచకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని వారి నుంచి లక్షల రూపాయలు దండుకోవడమే గాక, Sexually harassement చేశాడని, బలవంతంగా శృంగార వాంఛలు తీర్చుకున్న ఘటనలూ ఉన్నాయని పోలీసులు తెలిపారు.  

బఘేశ్వర్ కు చెందిన ఈ నిందితుడి పేరు చారు చంద్ర జోషి,  ప్రస్తుతం హల్ద్వానీ డొన్హారియా ఫ్రెండ్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతని మీద ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో చంబల్ వంతెన సమీపంలోని ఓ పార్కు వద్ద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

చంద్ర జోషి Facebook ద్వారా మహిళలను పరిచయం చేసుకుంటాడు.  నర్సింగ్ కోర్సు చేసే మహిళలే లక్ష్యంగా వాళ్లకు మాయమాటలు చెబుతాడు. తాను జిల్లా మెడికల్ ఆఫీసర్ నని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మిస్తాడు. అందుకు డబ్బులు కావాలని చెప్పి లక్షల రూపాయలు తీసుకుంటాడు. ఒక్కోసారి బలవంతం చేసి లైంగిక వాంఛ కూడా తీర్చుకుంటాడు. ఇలా 50 మందికి పైగా మహిళలను మోసం చేశాడని పోలీసులు తెలిపారు. 

ఇలాంటి ఘటనే బెంగళూరులో జరిగింది. modelingలో అవకాశాలు కల్పిస్తామంటూ యువతుల Nude photos, videoలు తీసుకుని వికృతానందం పొందుతున్న యువకుడిని మంగళవారం కర్ణాటకలోని హలసూరు పోలీసులు arrest చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిందితుడు ప్రపంచన్ ఒక ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు. Social mediaల్లో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేశాడు. 
మోడలింగ్ పై ఆసక్తి ఉన్న వారిని గుర్తించి మాయమాటలు చెప్పి వారి నగ్న ఫోటోలు, వీడియోలు తీసుకుని వికృతానందం పొందేవాడు. అతని మొబైల్ ని పరిశీలించగా వెయ్యికి పైగా యువతుల ప్రైవేట్ ఫోటోలు, దాదాపు 400 వీడియోలు వెలుగుచూశాయి అని డీసీపీ శరణప్ప తెలిపారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి కేసే నిరుడు డిసెంబర్ లో ఒకటి తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. Instagram లో యువతులను మోసం చేస్తున్న అజయ్ అనే యువకుడిని పోలీసులు డిసెంబర్ 24న అరెస్ట్ చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో యువతి Profile photoతో ఖాతా తెరిచిన అజయ్.. అమ్మాయిగా పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడినట్టు తేలింది. యువకుడిని అమ్మాయిగా భావించిన యువతులు వారి ఫొటోలను పంపించారు. 

వారి Nude pictures పంపించకపోతే మార్ఫింగ్ చేస్తానని... కోరిక తీర్చకపోతే మార్ఫింగ్ చేసిన చిత్రాలను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తానని threatsకు పాల్పడ్డాడు. ఈ మేరకు 15 రోజుల క్రితం అజయ్ పై సైబర్ క్రైం పోలీసులకు నగరానికి చెందిన యువతి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దిల్ సుఖ్ నగర్ లో అజయ్ ని అరెస్ట్ చేశారు. 

నిందితుడు అజయ్ వరంగల్ జిల్లా పరకాల వాసిగా పోలీసులు గుర్తించారు. అజయ్ హైదరాబాద్ లో మల్టీ మీడియా కోర్సు చేస్తున్నాడు. అజయ్ ఇప్పటివరకు చాలామంది యువతులను బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. 
 

click me!