బీజేపీ విజయం వెనుక అమిత్ షా వ్యూహం: మోడీ

Published : May 27, 2019, 12:56 PM IST
బీజేపీ విజయం వెనుక అమిత్ షా వ్యూహం: మోడీ

సారాంశం

దేశంలో బీజేపీ విజయం వెనుక అమిత్‌షా వ్యూహమే కీలకంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు.  


వారణాసి:  దేశంలో బీజేపీ విజయం వెనుక అమిత్‌షా వ్యూహమే కీలకంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు.

సోమవారం నాడు వారణాసిలో  ప్రధానమంత్రి మోడీ కాశీనాధుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల తర్వాత బీజేపీ కార్యకర్తల సమావేశంలో మోడీ, అమిత్ షా ప్రసంగించారు.

రెండో దఫా తనను గెలిపించినందుకు మోడీ వారణాసి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడ వారణాసి ఫలితాన్ని ఆసక్తిగా గమనించారని ఆయన చెప్పారు.

కాశీలో తాను సాధారణ కార్యకర్తను మాత్రమేనని మోడీ స్పష్టం చేశారు.కాశీ దర్శనం తనకు ప్రశాంతతను, గొప్ప శక్తిని ఇచ్చిందని మోడీ చెప్పారు వారణాసిలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. తన తరపున ప్రజలు ఈ ఎన్నికల్లో పోరాటం చేశారని మోడీ చెప్పారు.


 

PREV
click me!

Recommended Stories

Cyclone Arnab : అర్నబ్ తుపాను లోడింగ్..? రాబోయే మూడ్రోజులు వర్ష బీభత్సమే, ఇక్కడ అల్లకల్లోలం తప్పదు
Top 5 Online Orders : వీడు మామూలోడు కాదు.. ఒక్కడివే లక్ష రూపాయల కండోమ్స్ ఏం చేశావు గురూ..!