‘మహిళ పొట్ట పెరిగి ఉంటే ఆమె వర్జిన్ కాదు’ ఓ వ్యక్తి వితండవాదంతో నెట్టింట దుమారం

By Mahesh KFirst Published Jan 31, 2023, 3:39 PM IST
Highlights

మహిళ పొట్ట ఫ్లాట్‌గా కాకుండా కొంచెం బంప్ ఉన్న ఆమె వర్జిన్ కాదని ఓ వ్యక్తి వితండవాదం చేశాడు. పురుషుడి వీర్య కణాలు ఆమె వజీనా ద్వారా యుటెరస్‌కు చేరతాయని, వీర్య కణాలు చేరిన ప్రతి యుటెరస్ వాచిపోతుందని, అది పొట్ట ద్వారా బయటకు వెల్లడి అవుతుందని వాదించాడు. ఆయన వాదన ఎంతటి నిర్హేతుకమో నెటిజన్లు కామెంట్ల రూపంలో వెల్లడిస్తూ విరుచుకుపడ్డారు.
 

సమాచారం అంతా అరచేతిలోనే ఉండగా.. కొందరు అటు వైపుగా ఆలోచించడం లేదు. తమకు తెలిసిన లేదా.. ప్రచారంలో ఉన్న తప్పుడు అభిప్రాయాలను, వదంతులనే నిజం అని నమ్ముతున్నారు. అది వాస్తవమా కాదా? అని తెలుసుకునే అవకాశం టెక్నాలజీ కారణంగా వేలి అంచునే అందుబాటులో ఉంటున్నది. కానీ, దాన్ని పక్కన పెట్టి తప్పుడు విషయాలను అదే నిజమని భ్రమించి ఏకంగా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇలాంటి పోస్టులు ఇంటర్నెట్‌లో కలకలం రేపుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఓ పోస్టు చేసిన దుమారం రేపింది.

ఓ వ్యక్తి తన అవగాహనరాహిత్యాన్ని డాంభికంగా చెప్పుకుని అబాసుపాలయ్యాడు. పొట్ట చదునుగా లేని మహిళ వర్జిన్‌లు కాదని తన అమాయకత్వాన్ని చాటుకున్నాడు. పొట్ట కొంత పెరిగి ఉంటే ఆ మహిళ తన వర్జినిటీని కోల్పోయిందని భావించాలని తెలిపాడు. పురుషుడితో శారీరకంగా కలిసినప్పుడు అతని నుంచి వీర్య కణాలు మహిళ యుటెరస్‌లోకి వెళ్లుతాయని, వీర్య కణాలు చేరిన ఏ మహిళ యుటెరస్ అయినా విపరీతంగా ఉబ్బుతుందని వాదించాడు. ఉబ్బిన యుటెరస్‌ను ఆ మహిళ పొట్ట వెల్లడిస్తుందని పేర్కొన్నాడు. అంటే.. ఒక మహిళ పొట్ట చదునుగా కాకుండా ఉబ్బి ఉంటే మాత్రం ఆ మహిళ కన్యత్వం కోల్పోయినట్టే అని తెలిపాడు. ఒక్కసారి పురుషుడితో కలిసిన మహిళ పొట్ట కచ్చితంగా ఉబ్బుతుందని, ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ ఫ్లాట్‌గా కాదని వివరించాడు. గర్భం దాల్చకున్నప్పటికీ ఆమె పొట్ట పెరిగే ఉంటుందని వితంవాదం చేశాడు. పురుషుడు వర్జిన్ మహిళను పొందడమే కరెక్ట్ అని తెలిపాడు. స్త్రీవాదులు కొంత ఓపిక పట్టాలని, ఫ్లాట్ పొట్ట ఉన్న మహిళను పురుషుడు కోరుకోవడంలో తప్పేమీ లేదు కదా అని పేర్కొన్నాడు. ఈ వాదనకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఓ వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేశాడు.

Also Read: ఇదేం పిచ్చి లోకం.. ఫైన్‌లు, ఫైట్లు! 300ఫైన్ కోసం నాలుగు తరాలుగా గొడవలు.. వేలకు పెరిగిన జరిమానా.. తెగని పంచాయతీ

సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత అవసరం అనేది ఆయన వాదనను చూస్తే తెలుస్తుంది. మహిళ శరీరక నిర్మాణం గురించి అవగాహన చాలా మందిలో ఉండదు. కానీ, అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. తద్వారా పై వ్యక్తి చేసిన వాదనలోని అవాస్తవాన్ని సులువుగా గుర్తించవచ్చు.

Ladies, is your uterus showing today? 🤦🏻‍♀️ pic.twitter.com/rrxoozQDRt

— AskAubry 🦝 (@ask_aubry)

పై వాదనకు సంబంధించిన పోస్టు పై కామెంట్లు పోటెత్తాయి. చాలా మంది ఎంతమాత్రం లాజిక్ లేని ఆయన కామెంట్ పై విరుచుకుపడ్డారు. కొందరైతే.. ఇప్పుడే తాను రెడ్ వైన్ తాగి.. బర్గర్ తిన్నానని, కాబట్టి, తన పొట్ట పెరిగిందని ఒకరు కామెంట్ చేశారు. ఇంకొకరు తాను చాలా సార్లు లైంగిక చర్యలో పాల్గొన్నానని, కానీ, తన పొట్ట ఫ్లాట్‌గా ఉంటుందని వివరించారు.

click me!