సుడిగాడు: చావును నెత్తిమీద పెట్టుకుని.. 11 కిలోమీటర్ల ప్రయాణం

By Siva KodatiFirst Published Feb 14, 2020, 10:19 PM IST
Highlights

కొందరినీ అదృష్టం నీడలా కాపాడుతుంది. మరికొందరినీ మాత్రం దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. తాజాగా ఓ వ్యక్తి నెత్తీ మీద చావును పెట్టుకుని 11 కిలోమీటర్లు ప్రయాణించాడు. గమ్యం చేరుకున్నాకా కానీ అతనికి అసలు విషయం అర్ధం కాలేదు. 

కొందరినీ అదృష్టం నీడలా కాపాడుతుంది. మరికొందరినీ మాత్రం దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. తాజాగా ఓ వ్యక్తి నెత్తీ మీద చావును పెట్టుకుని 11 కిలోమీటర్లు ప్రయాణించాడు. గమ్యం చేరుకున్నాకా కానీ అతనికి అసలు విషయం అర్ధం కాలేదు.

వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రం కందనాడ్‌లోని మేరీ హైస్కూలుతో సంస్కృత పండితుడిగా పనిచేస్తున్న రంజిత్ అనే వ్యక్తి ఫిబ్రవరి 5న తరగతులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై మరో స్కూలుకు బయలుదేరాడు.

Also Read:గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లోకి పాము.. వీడియో వైరల్

అయితే ఎప్పుడు దూరిందో ఏమో కానీ అతను పెట్టుకున్న హెల్మెట్‌లో ఒక విషసర్పం ఉంది. అది చూసుకోకుండానే హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం సాగించాడు. దారిలో కూడా అతనికి ఎలాంటి అనుమానం కలగలేదు.

అయితే గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత హెల్మెట్ తీసి చూసుకుంటే ఓ పాము కనిపించింది. అప్పటికే అది చనిపోయి.. నుజ్జునుజ్జయి ఉంది. ఈ విషయం తోటి ఉద్యోగులకు తెలియడంతో ఆయన అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Aslo Read:కుక్క పిల్లల కోసం ప్రాణాలకు తెగించి.. పాముల బావిలోకి దిగి..

రక్తపరీక్షలో రంజిత్‌ను పాము కాటేయలేదని వైద్యులు ధ్రువీకరించారు. ఈ పాము తమ ఇంటి దగ్గర ఉన్న చెరువులో నుంచి హెల్మెట్‌లోకి వచ్చి ఉంటుందని రంజిత్ అభిప్రాయపడ్డాడు.

కాగా ఈ మధ్య కాలంలో కేరళలో పాముల బెడద ఎక్కువైపోయింది. గతేడాది డిసెంబర్‌లో ఓ వ్యక్తి బావిలో పడ్డ అనకొండను రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

click me!