స్విట్జర్లాండ్‌లో కారుణ్య మరణానికి ప్రయాణం.. ఫ్రెండ్‌ను ఆపడానికి హైకోర్టులో పిటిషన్

Published : Aug 12, 2022, 03:56 PM IST
స్విట్జర్లాండ్‌లో కారుణ్య మరణానికి ప్రయాణం.. ఫ్రెండ్‌ను ఆపడానికి హైకోర్టులో పిటిషన్

సారాంశం

క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న 40 ఏళ్ల వ్యక్తి కారుణ మరణం పొందడానికి స్విట్జర్లాండ్ వెళ్లబోతున్నారు. ఇప్పటికే ఒకసారి వెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాడు. 70 ఏళ్లకు పైగా ఉన్న తన తల్లిదండ్రులను ఆ వ్యక్తి ఎమోషనల్‌గా బలవంతపెట్టి తనను స్విట్జర్లాండ్ తీసుకెళ్లడానికి ఒప్పించాడని, ఆయన విదేశానికి వెళ్లకుండా ఆపాలని ఫ్యామిలీ ఫ్రెండ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.  

న్యూఢిల్లీ: కాలం గడిచిన కొద్దీ ఆరోగ్య పరిస్థితులు మరింత దిగజారిపోయేలా ఉంటే సదరు మనిషి యూరప్‌కు వెళ్లి కారుణ్య మరణం పొందవచ్చా? ఈ ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశం అయింది. యూరప్‌లోని చాలా దేశాల్లో కారుణ్య మరణాలకు సానుకూల నిర్ణయాలు ఉన్నాయి. మన దేశం కారుణ్య మరణాన్ని దాదాపుగా స్వీకరించదు. ఆత్మహత్యను భారత దేశం అనుమతించదు. కానీ, ఓ వ్యక్తి కారుణ్య మరణం కోసం స్విట్జర్లాండ్ వెళ్లాలనుకుంటున్నాడు. తన ప్రయాణానికి అనుమతించడానికి అధికారులకు సమర్పించిన డాక్యుమెంట్లలో కొన్ని అబద్ధాలు పేర్కొన్నట్టు ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ అబద్ధాలను ఆధారంగా చేసుకుని తమ మిత్రుడిని స్విట్జర్లాండ్ వెళ్లకుండా అడ్డుకోవాలని పిటిషన్‌లో కోరారు.

నోయిడాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడు. ఇది కాలం గడిచిన కొద్దీ ఆయన ప్రాణాలను మరింత తోడేస్తూ వెళ్లుతున్నది. ఈ వ్యాధిని 2014లో గుర్తించారు. ఆ తర్వాత ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కానీ, లాక్‌డౌన్ కాలంలో ఆయన చికిత్స పొందలేకపోయారు. ఈ చికిత్స కోసం డోనర్స్ అవసరం ఉంటుంది. లాక్‌డౌన్ కాలంలో ఇది సాధ్యపడలేదు. దీంతో ఆ వ్యక్తి ఆరోగ్యం దారుణంగా దిగజారి కేవలం మంచానికే పరిమితం అయ్యాడు. కొన్ని అడుగుల మేరకు మాత్రమే నడుస్తున్నాడు. ఆ వ్యక్తి తల్లిదండ్రుల వయసు కూడా 70 ఏళ్లకు పైనే ఉన్నది. ఈ తరుణంలో ఆయన కారుణ్యం మరణం పొందాలని భావించాడు. తన తల్లిదండ్రులను ఎమోషనల్‌గా బలవంతపెట్టాడు. 

ఇప్పటికే ఆ వ్యక్తి ఒకసారి స్విట్జర్లాండ్ వెళ్లి వచ్చాడు. స్విట్జర్లాండ్‌లో డిగ్నిటాస్ అనే సంస్థను సంప్రదించారు. ఆ సంస్థ నిర్వహించే కారుణ్య మరణానికి తాను అర్హుడా కాదా? అని తెలుసుకున్నాడు. ఇంటర్వ్యూ పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ స్విట్జర్లాండ్‌కు వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ సారి కారుణ్య మరణం పొందడానికే వెళ్లుతున్నాడు అని ఆ వ్యక్తి ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు ఢిల్లీ హైకోర్టుకు పిటిషన్ వేశారు.

ఆ వ్యక్తి ఇప్పటికే షెంజెన్ వీసా పొందాడని వివరించారు. బెల్జియంలో మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం వెళ్లుతున్నట్టు భారత అధికారులకు అబద్ధపు వివరాలు తెలిపాడని, విదేశీ అధికారులకూ ఇదే విషయాన్ని చెప్పాడని తెలిపారు. నిజానికి ఆయన బెల్జియం మీదుగా స్విట్జర్లాండ్ వెళ్లనున్నారని, అక్కడ డిగ్నిటాస్ అనే సంస్థ సహాయంతో కారుణ్య మరణం పొందనున్నారని వివరించారు.

ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టులో వచ్చే నెలలో విచారించే అవకాశం ఉన్నది. వచ్చే వారం వరకు హైకోర్టు మూసే ఉన్నది. వచ్చే నెల వరకు ఈ పిటిషన్ లిస్టింగ్ అయ్యే అవకాశాలు లేవని తెలుస్తున్నది.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం