కొడుకు కోసం.. భార్య,ఇద్దరు కూతుర్లను బావిలోకి తోసి,రాళ్లేసిన భర్త..

Published : Jun 07, 2021, 09:24 AM IST
కొడుకు కోసం.. భార్య,ఇద్దరు కూతుర్లను బావిలోకి తోసి,రాళ్లేసిన భర్త..

సారాంశం

మధ్యప్రదేశ్ ఛతార్ పూర్ లో దారుణం చోటు చేసుకుంది. రెండోసారి కూడా ఆడపిల్లే పుట్టిందన్న కచ్చతో ఓ వ్యక్తి భార్య, ఇద్దరూ పిల్లల్ని బావిలోకి తోసేశాడు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి మృత్యువాత పడిందని ఛతార్ పూర్ పోలీసులు తెలిపారు. 

నిందుతుడిని రాజా భయ్యా యాదవ్ గా గుర్తించారు. వివరాల్లోకి వెడితే.. రాజా భయ్యా భార్య మూడునెలల కిందట రెండోసారి అమ్మాయికి జన్మనిచ్చింది. ఈ క్రమంలో పుట్టింటినుంచి ఆమెను, మొదటి కూతురు ఎనిమిదేళ్లచిన్నారిని తీసుకురావడానికి రాజా భయ్యా తన మోటర్ సైకిల్ మీద వెళ్లాడు.

ఇంటికి తీసుకువచ్చే క్రమంలో మార్గమధ్యంలో ఓ పాడుబడిన బావి దగ్గర తన మోటార్ సైకిల్ ని ఆపి..భార్య, ఇద్దరు కూతుర్లను బలవంతంగా బావిలోకి తోసేశాడు. వాళ్లు బైటికి రాకుండా పైనుంచి రాళ్లు వేశాడు. ఎనిమిదేళ్ల కూతురు ఆ క్రమంలో మరణించింది. భార్య కేకలకు స్థానికులు రావడంతో, మూడునెలల చిన్నారితో సహా ఆమెను రక్షించారు.

రెండోసారి కూడా కూతురే పుట్టడంతో రాజాభయ్యా కోపంగా ఉన్నాడని.. కొడుకు కావాలని ఇలా చేశాడని బాధితురాలైన భార్య పోలీసులకు తెలిపింది. అయితే నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. దీంతో అతని మీద కేసు నమోదుచేసి, వెతుకుతున్నామని పోలీసు అధికారి సింగ్ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?