గర్ల్ ఫ్రెండ్ కి సీక్రెట్స్ చెబితే ఇలానే ఉంటుంది..!

Published : Jun 26, 2021, 03:13 PM IST
గర్ల్ ఫ్రెండ్ కి సీక్రెట్స్ చెబితే ఇలానే ఉంటుంది..!

సారాంశం

మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో సీక్రెట్స్ షేర్ చేసుకుంటున్నారా..? అయితే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందేనని ఓ యువకుడు హెచ్చరిస్తున్నాడు.

మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో సీక్రెట్స్ షేర్ చేసుకుంటున్నారా..? అయితే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందేనని ఓ యువకుడు హెచ్చరిస్తున్నాడు. తన జీవితంలో తాను ఎదుర్కొన్న ఓ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. 

ఇంతకీ మ్యాటరేంటంటే...  ప్రస్తతం కరోనా కారణంగా చాలా మంది ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారనే విషయం మనకు తెలిసిందే. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారు ఇంటి దగ్గర నుంచే 8 గంటల పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఒక ఉద్యోగి ఆటోమేషన్ సహాయంతో కేవలం 2 గంటల్లోనే పని చేసేసి మిగిలిన సమయాన్ని ఇతర పనుల కోసం వాడుకుంటున్నాడు. 

ఆ విషయాన్ని తన ఆఫీస్‌లో తనతో పాటే పనిచేస్తున్న తన ప్రేయసికి చెప్పాడు. ఇటీవల వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఆమె అతని ఛీటింగ్‌ గురించి ఆఫీస్‌లోని హెచ్‌ఆర్‌కు చెప్పేసింది. అంతేకాదు వర్కింగ్ అవర్స్‌లో అతను చేసిన పనులను రికార్డు చేసి వారికి చూపించింది. దీంతో అతడిని ఉద్యోగంలో నుంచి తీసేసేందుకు కంపెనీ సిద్ధమైంది. అయితే అతను బతిమాలుకోవడంతో వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. అతను తన కథ మొత్తాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే.. ఈ సంఘటన ఎక్కడ జరిగిందీ అన్న విషయం మాత్రం బయటకు రాలేదు. 

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word