భార్యపై అనుమానం.. కూతురిని చంపి, బకెట్లో కుక్కి, గడ్డివాములో దాచిపెట్టిన భర్త..

Published : Oct 07, 2022, 10:00 AM IST
భార్యపై అనుమానం.. కూతురిని చంపి, బకెట్లో కుక్కి, గడ్డివాములో దాచిపెట్టిన భర్త..

సారాంశం

భార్య మీద అనుమానంతో ఓ భర్త దారుణానికి తెగబడ్డాడు. ఎనిమిదేళ్ల కూతురిని చంపి, బకెట్ లో కుక్కి గడ్డివాములో దాచిపెట్టాడు. ఆ తరువాత పారిపోయాడు.  

మధురై : తమిళనాడులో ఓ దారుణ ఘటన కలకలం రేపింది. ఓ వ్యక్తి తన ఎనిమిదేళ్ల కూతురుని హత్య చేసి.. బకెట్ లో కుక్కి, గడ్డివాములో దాచి పెట్టాడు. అతడిని 45 రోజుల తరువాత పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెడితే.. తమిళనాడులోని మధురై నగరంలోని జైహింద్‌పురంలో ఈ ఘటన జరిగింది. హత్య చేసిన తరువాత నిందితుడు పరారీలో ఉన్నాడు.  అతడిని 45 రోజుల తరువాత పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కాళీముత్తు, అతని భార్య ప్రియదర్శిని సోలై అలగుపురంలో నివసిస్తున్నారు. కాళీముత్తు స్థానిక టైలరింగ్ షాపులో, ప్రియదర్శిని తూర్పు గేటు వద్ద ఉన్న పాత్రల దుకాణంలో పనిచేస్తున్నారు. వీరి కుమార్తె ఎనిమిదేళ్ల తన్షిక.

సెప్టెంబర్ 3న తన్షికను కాళీముత్తు ఇంటి నుంచి బైటికి తీసుకెళ్లాడు. ఆ తరువాత చిన్నారి కనిపించకుండాప పోయింది. దీంతో పాప గురించి భర్తను తల్లి అడగగా.. చిన్నారిని తన చెల్లి ఇంట్లో ఉంచి వచ్చానని చెప్పాడు. సెప్టెంబర్ 23న కాళీముత్తు ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు జైహింద్‌పురం పోలీసులకు సమాచారం అందించారు. బాలికను హత్య చేసి, పెద్ద బకెట్‌లో మృతదేహాన్ని కుక్కి.. గడ్డివాములో దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

మహిళకు ప్రైవేట్ పార్ట్స్ చూపించిన వ్యక్తి అరెస్ట్...!

అయితే, చంపిన రోజునుంచి కాళీముత్తు పరారీలో ఉన్నాడు. అతనికి భార్యమీద అనుమానం ఉండేది. దీంతో వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవని విచారణలో తేలింది. నిందితుడిని బుధవారం పలంగనాథం దగ్గర పోలీసులు అరెస్టు చేశారు. అయితే, నిందితుడు భార్యతో తరచూ గొడవలు జరిగే విషయాన్ని చిన్నారికి చెప్పేవాడని పోలీసులకు తెలిపాడు. దీంతో, తామిద్దరం చనిపోదామని బాలిక అతనికి చెప్పింది. దీంతో బాలికను గొంతుకోసి హత్య చేసి, మృతదేహాన్ని బకెట్‌లో పెట్టాడు. ఆ తరువాత అతను కూడా చనిపోదామని రైల్వే ట్రాక్‌ దగ్గరికి వెళ్లాడు. కానీ అక్కడికి వెళ్లాక మనసు మార్చుకున్నాడు. 

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu