
కర్ణాటక : karnatakaలో దారుణం జరిగింది. మైనర్ ప్రియుడి మోజులో ఓ భార్య ఘాతుకానికి తెగబడింది. lover మత్తులో పడి కట్టుకున్న భర్తనే ఓ భార్య చంపించింది. శిరా తాలూకా కరెజవనహళ్లి గ్రామంలో రాజు (34)ను మంగళవారం రాత్రి ప్రియుడు రాకేష్ (19), భార్య మీనాక్షి (25) ్లిపి హత్య చేశారు. 8 ఏళ్ల క్రితం మీనాక్షితో రాజుకు వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కరెజవనహళ్లి గ్రామానికి చెందిన రాకేష్ తుమకూరులోని ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటున్నాడు. ఒక పెళ్లిలో మీనాక్షితో రాకేష్ కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వారిద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకోవడం ప్రారంభించారు.
టైలర్ అయిన మీనాక్షి దగ్గరికి దుస్తులు ఇచ్చే నెపంతో తరచూ రాకేష్ వచ్చేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. మీనాక్షి భర్త బెంగళూరులో కూలీపని చేస్తుండేవాడు. దీంతో ఏడాది పాటు వీరి సంబంధం ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతోంది. రెండు నెలల క్రితం బెంగళూరులో కూలి పని చేస్తున్న రాజు తిరిగి ఇంటికి వచ్చేశాడు. అయితే అప్పటి వరకు ఏ అడ్డూ లేకుండా పోవడం.. రాజు రావడంతో తామిద్దరూ కలుసుకోవడానికి కుదరకపోవడం... తన ఆనందానికి అడ్డుగా ఉన్నాడని భావించిన మీనాక్షి, రాకేష్ లు రాజును మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు.
పక్కా ప్లాన్ ప్రకారం సమీపంలోని తోటలో రాజును రాకేష్ మందు పార్టీకి పిలిచాడు. రాజు మత్తులో ఉండగా బండరాయితో కొట్టి చంపాడు.. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సమాచారం అందుకున్న కళ్ళంబెళ్ల పోలీసులు ప్రేయసీప్రియుడిని అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా, వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని మైనర్ బాలుడిని హత్య చేసిన ఘటన మండలంలోని మేడిపల్లి జీపీ పరిధిలో గల హన్మంతు తండాలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హన్మంతు తండాకు చెందిన జోగిని లక్ష్మి, తన అక్క కొడుకు రాజు(16)తో కలిసి ఉంటోంది. రాజు తల్లిదండ్రులు కొంతకాలం క్రితం మృతి చెందారు. దీంతో రాజు తన చిన్నమ్మ లక్ష్మి దగ్గర ఉంటూ పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. లక్ష్మి పలువురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుంది.
సీతాయి పల్లి గ్రామానికి చెందిన కుర్మ మల్లయ్యతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో బాలుడు తనకు అడ్డుగా ఉన్నాడని భావించింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి బాలుడు నిద్రపోయిన తర్వాత పథకం ప్రకారం ప్రియుడితో కలిసి బాలుడిని చీరతో ఉరివేసి హత్య చేసినట్లు తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు సీఐ రామన్ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు.