
మహారాష్ట్ర : అత్యంత దారుణమైన, హేయమైన, నీచాతినీచమైన సంఘటనలు జరుగుతున్నాయి. ‘ఆడ’ అనే.. పేరు అది మనిషి కావచ్చు.. జంతువు కావచ్చు.. మగ మృగాళ్లు వదలడం లేదు. ఆవులమీద, మేకలమీద అత్యాచారాలు చేసిన ఘటనలు ఈ కోవలోవే. ఇప్పుడు తాజాగా మహారాష్ట్రలో ఓ అరుదైన జాతికి చెందిన బల్లిని రేప్ చేశారు మానవ మృగాళ్లు.. నోరులేని మూగజీవిమీద కామవాంఛ తీర్చుకోవడమే కాకుండా సెల్ ఫోన్లలో చిత్రీకిరంచారు కూడా. వివరాల్లోకి వెడితే...
maharashtraలోని గోథానే గ్రామ సమీపంలోని Sahyadri Tiger Reserveలో ఈ ఘటన చోటు చేసుకుంది. టైగర్ రిజర్వ్ లోని Bengal monitor lizardపై నలుగురు వేటగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నేరానికి గాను ఆ నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులంతా వేటగాళ్లుగా గుర్తించారు. వీరు గోథానే వద్ద గభా ప్రాంతంలో సహిదరి టైగర్ రిజర్వ్ కోర్ జోన్‌లోకి ప్రవేశించి.. ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
ఈ నిందితులను సందీప్ తుక్రమ్, పవార్ మంగేష్, జనార్దన్ కమ్టేకర్, అక్షయ్ సునీల్‌గా గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్న తరువాత మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు నిందితుల మొబైల్ ఫోన్లను పరిశీలించగా.. ఘటన గురించి తెలిసింది. నిందితులు మానిటర్ బల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆ వీడియోలో తెలుస్తోంది.
సాంగ్లీ ఫారెస్ట్ రిజర్వ్‌లో విధుల్లో ఉన్న అటవీ అధికారులకు సీసీటీవీ ఫుటేజీలో నలుగురు వ్యక్తులు అక్రమంగా అడవిలో తిరుగుతున్నట్లుగా తెలిసింది. దీంతో వారు వెంటనే ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో వీరికి నిందితులు చేసిన ఘాతుకం తెలియదు. ఆ తరువాత వారి వద్ద ఉన్న ఫోన్లను స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తూ, ముగ్గురు నిందితులు కొంకణ్ నుంచి కొల్హాపూర్‌లోని చందోలి గ్రామానికి వేట కోసం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై కంగుతిన్న అటవీశాఖ అధికారులు నిందితులపై అభియోగాలపై చర్చించేందుకు ఇండియన్ పీనల్ కోర్ట్‌తో విచారణ చేపట్టనున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. బెంగాల్ మానిటర్ బల్లి వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం రిజర్వు చేయబడిన జాతి. నేరం రుజువైతే, నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష విధించబడుతుంది.
ఇదిలా ఉండగా, ఏప్రిల్ ఒకటిన ఆవుపైనే అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో ఈ అమానవీయ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో కిటికీ ఊచలకు కట్టిన తాడు మెడకు ఉరిపడి గోమాత మృతి చెందింది. స్థానిక ఎస్ఐ సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం… పిప్రి గ్రామానికి చెందిన రైతు రావుల సాయన్న కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఇంట్లో మార్బుల్ వేసేందుకు ఉత్తరప్రదేశ్ కు చెందిన కూలీలను పిలిచాడు. వీరిలో నిందితుడు విజయ్ బుధవారం అందరు నిద్రించాక సాయన్నకు చెందిన ఆవును నూతన గృహంలోకి తీసుకువచ్చి కిటికీ ఊచలకు తాళ్లతో బంధించి అత్యాచారానికి ఒడిగట్టాడు.
పెనుగులాటలో మార్బుల్ బండలు జారి ఊచలకు కట్టిన తాడు మెడకు ఉరిగా బిగించుకోవడంతో ఆవు మృతి చెందింది. ఉదయం పెరట్లో ఆవు కనిపించకపోవడంతో ఇల్లంతా వెతికిన రైతుకు కొత్త ఇంట్లో మరణించి కనిపించింది. అంతేకాదు కూలి విజయ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించగా.. కూలీ విజయ్ తాను చేసిన ఒప్పుకోవడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైద్యాధికారి జెస్సీ గోవుకు పోస్టుమార్టం నిర్వహించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.