అక్కపెళ్లికి డబ్బులు కావాలని.. కారు ఓనర్ ను హత్య చేసిన తమ్ముడు..

Published : Feb 09, 2021, 12:08 PM IST
అక్కపెళ్లికి డబ్బులు కావాలని.. కారు ఓనర్ ను హత్య చేసిన తమ్ముడు..

సారాంశం

అక్క పెళ్లికి డబ్బుకోసం ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన కర్నాటకలో జరిగింది. కర్నాటకలోని కొరటిగెరెలో ఇటీవల ఓ కార్ డ్రైవర్ ను కత్తితో పొడిచి చంపి, కారును కరెంట్ స్తంభానికి ఢీ కొట్టి యాక్సిడెంట్ గా చిత్రించిన ఘటన గురించి తెలిసిందే.

ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బెంగళూరు అత్తిబెలివాసి వీరేంద్ర (24). ఫిబ్రవరి 16న వీరేంద్ర అక్క పెళ్లి ఉంది. పెళ్లికి డబ్బులు కావాలని దీనికోసం దారుణమైన దారి ఎంచుకున్నాడు. హత్య చేయాలని పథకం వేసుకున్నాడు. 

బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటిలో కారు డ్రైవర్, యజమాని అయిన నిసార్ అహ్మద్ (35)ను కొరటిగెరెకు వెల్దామని తీసుకొచ్చాడు. అక్కడ కారును దొంగిలించాలని పథకం వేశాడు. డ్రైవర్ నిస్సార్ కారులో పడుకుని ఉండగా అతని మీద దాడి చేశాడు. నిస్సార్ ఛాతిలో నాలుగు సార్లు కత్తితో పొడిచి, కారుతో చెట్టుకు ఢీ కొట్టించాడు.

అయితే కారు దెబ్బతినడంతో అతని ప్లాన్ వర్కవుట్ కాలేదు. దీంతో కారు లేకుండానే పరారయ్యాడు. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనుమానంతో విచారించగా అసలు విషయం బైటపడింది. 

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu