
పెళ్లి చేసుకోని తాను మోసపోయానని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. తన భార్య అందరు స్త్రీలా లేదని.. తనకు న్యాయం చేయాలంటూ కోర్టుకి ఎక్కాడు. తన భార్యకు.. పురుషాంగం ఉందని చెప్పడం గమనార్హం. తనను మోసం చేసిన భార్యపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పరిశీలించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది.
మెడికల్ రిపోర్టు ప్రకారం ఆమె ఆడది కాదంటూ, తాను మోసపోయానని, తన నుండి విడాకులు ఇప్పించాలంటూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. భర్త పిటిషన్‌పై స్పందించాలని సదరు భార్యను కోర్టు కోరింది.
గత ఏడాది జులై 29న మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తన భర్త వేసిన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎం.ఎం సుందరేష్ ధర్మాసనం ఆమెకు నోటీసులు జారీ చేసింది. వైద్య పరీక్షలో ఆమె అసంపూర్తి మహిళగా తేలిందని, దీనిని బట్టి ఆమె ఆడది కాదని పేర్కొంటూ వేసిన పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు సదరు మహిళను వివరణ కోరింది.
2016లో తమకు వివాహం అయిందని, ఆమె రుతుక్రమం కారణంగా తనకు దూరంగా ఉందని, అనంతరం ఆమె తన వద్దకు తిరిగి వచ్చిందని పిటిషన్‌లో భర్త పేర్కొన్నారు. ఆమెతో సన్నిహితంగా మెలిగే సమయంలో తనకు దూరంగా ఉండటంతో అనుమానం వచ్చి వైద్యుని వద్దకు తీసుకెళ్లగా.. ఇంపర్‌ఫోరెట్ హైమన్ (చిన్నపాటి పురుషాంగం) ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారని, దాన్ని ఆపరేషన్‌లో తొలగించవచ్చునని, అయితే దాదాపు పిల్లలు పుట్టరని వైద్యులు నిర్ధారించినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పానని, తన కుమార్తెను తన వద్దకు పంపాలని చెప్పారని తెలిపారు. భార్యకు ఆపరేషన్ చేయించారని, తన కూతుర్ని కాపురానికి తీసుకెళ్లాలని తన మామా బెదిరించారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో తనను మోసం చేశారంటూ , తనకు భార్య నుండి విడాకులు ఇప్పించాలంటూ మధ్యప్రదేశ్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు .. కేవలం మౌఖిక సాక్ష్యం ఆధారంగా, మెడికల్ సాక్ష్యం లేకుండా చీటింగ్ చేశారని చెప్పడం సాధ్యపడదంటూ.. అతడి పిటిషన్‌ను కొట్టివేసింది.