ఫుడ్ డెలివరీకి వచ్చి... మహిళా డాక్టర్ పై అత్యాచారం..!

Published : Jul 01, 2021, 10:19 AM IST
ఫుడ్ డెలివరీకి వచ్చి... మహిళా డాక్టర్ పై అత్యాచారం..!

సారాంశం

చెండిపద ఏరియాలోని దాబా యజమాని కుమారుడు సుకుంత బెహ్రా(35) రాత్రి 11 గంటల సమయంలో ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు ఓ మహిళా డాక్టరు ఇంటికి వచ్చాడు. 

ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చి..  ఓ వ్యక్తి మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకోగా...  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాత్రి సమయంలో ఫుడ్ డెలివరీకి వచ్చి ఒంటరిగా ఉన్న ఓ మహిళా డాక్టరుపై అత్యాచారం చేసిన దాబా యజమాని కుమారుడి బాగోతం ఒడిశా రాష్ట్రంలోని అంగూల్ జిల్లాలో వెలుగుచూసింది. చెండిపద ఏరియాలోని దాబా యజమాని కుమారుడు సుకుంత బెహ్రా(35) రాత్రి 11 గంటల సమయంలో ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు ఓ మహిళా డాక్టరు ఇంటికి వచ్చాడు. 

మహిళా వైద్యురాలు ఒంటరిగా ఉండటం చూసిన సుకుంత బెహ్రా ఆమెపై అత్యాచారం చేసి పారిపోయాడు. మహిళా వైద్యురాలు తన క్వార్టరులో నివాసముండగా ఆమెపై సుకుంత అఘాయిత్యం చేశాడు. మహిళా డాక్టరు సోదరుడి ఫిర్యాదు మేర పోలీసులు సుకుంత బెహ్రాపై కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. వైద్యురాలిని పరీక్ష కో్సం ఆసుపత్రికి తరలించారు.
 

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం