మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం.. గర్భం రావడంతో..

Published : Nov 28, 2020, 10:37 AM ISTUpdated : Nov 28, 2020, 10:42 AM IST
మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం.. గర్భం రావడంతో..

సారాంశం

బాధితురాలికి మాయమాటలు చెప్పి గత కొన్ని రోజులుగా పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ సదరు బాలికను బెదిరించాడు. 

ఓ మైనర్ బాలికపై ఓ యువకుడు కన్నేశాడు. బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతో.. సదరు యువతి గర్భం దాల్చింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


మహారాష్ట్రలోని థానే పట్టణణంలోని కళ్యాణ్ ప్రాంతంలోని ఓ మైనర్ బాలికకు తీరని అన్యాయం జరిగింది. మైనర్‌ బాలిక ఇంటిపక్కనే ఉన్న 21 ఏళ్ల యువకుడు కన్నేశాడు.  బాధితురాలికి మాయమాటలు చెప్పి గత కొన్ని రోజులుగా పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ సదరు బాలికను బెదిరించాడు. కాగా.. అతని కారణంగా  బాలిక గర్భవతి అయింది. దీంతో కొద్ది రోజుల క్రితం బాధితురాలు ఓ శిశువుకి జన్మనిచ్చింది. బాలిక పెళ్లి చేసుకోమని కోరినప్పటికీ అతను నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో.. బాలిక ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియజేసింది.

 వారు ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీంతో నిందితుడు బిహార్‌ పారిపోయాడని పోలీసులు తెలిపారు. అతడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. 

PREV
click me!

Recommended Stories

స్టాలిన్ పై సీఎం విజయ్ పంచ్ లు సభమొత్తం నవ్వులే నవ్వులు | CM Vijay Funny Speech on MK Stalin Viral
Onion Price Hike : ఏవండోయ్ కామన్ మ్యాన్స్.. ఈ వీకెండ్ మార్కెట్లోనే ఉల్లిపాయలు కొనేయండి, లేదంటే దబిడిదిబిడే