పెద్ద కూతురిపై అఘాయిత్యం చేసి జైలుకి.. బయటకు వచ్చాక చిన్న కూతురిపై...

Published : Jun 25, 2020, 09:56 AM IST
పెద్ద కూతురిపై అఘాయిత్యం చేసి జైలుకి.. బయటకు వచ్చాక చిన్న కూతురిపై...

సారాంశం

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతుళ్ల పట్ల కామాంధుడిలా ప్రవర్తించాడు. కనీసం చిన్న పిల్ల అనే జాలి కూడా లేకుండా సొంత కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఈ సంఘటన పూణేలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సమాజంలో రోజు రోజుకీ మానవత్వం అన్నదే లేకుండా పోతోంది. కనీసం కుటుంబ విలువలు కూడా లేకుండా పోతున్నాయి. ఆడ పిల్లలకు బయటకు వెళితే రక్షణ లేదు అని అందరూ అంటుంటారు. కానీ.. సొంత ఇంట్లో కూడా రక్షణ ఉండటం లేదు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతుళ్ల పట్ల కామాంధుడిలా ప్రవర్తించాడు. కనీసం చిన్న పిల్ల అనే జాలి కూడా లేకుండా సొంత కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఈ సంఘటన పూణేలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూణేలోని చించ్వాడకు చెందిన ఓ 40ఏళ్ల వ్యక్తి తన 11ఏళ్ల కుమార్తెను బలాత్కరించాడు. ఈ దుర్మార్గుడు నాలుగేళ్ల క్రితం తన పెద్ద కుమార్తెను బలాత్కరించి ఇటీవలే విడుదలయ్యాడు. విడుదలై ఇంటికి వచ్చిన ఈ కామాంధుడు.. ఈసారి తన చిన్న కూతురిపై కన్నేశాడు. 

భర్త ప్రవర్తనపై భార్యకు అనుమానం కలిగింది...  దీంతో వెంటనే కుమార్తెను వైద్య పరీక్షలకు తీసుకెళ్లడంతో ఇతను చేసిన ఘాతుకం వెలుగుచూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు కీచకతండ్రిని అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?