భార్యభర్తల గొడవలో తలదూర్చి వివాహితపై అత్యాచారం, ఇంట్లోనుంచి గెంటేసి, విడాకుల నోటీసులు పంపిన భర్త.. చివరికి...

Published : Jul 21, 2022, 02:14 PM IST
భార్యభర్తల గొడవలో తలదూర్చి వివాహితపై అత్యాచారం, ఇంట్లోనుంచి గెంటేసి, విడాకుల నోటీసులు పంపిన భర్త.. చివరికి...

సారాంశం

మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యభర్తల గొడవలో తలదూర్చిన ఓ వ్యక్తి.. స్నేహితుడి భార్య మీద అత్యాచారం చేశాడు. విషయం తెలిసిన భర్త ఆమెకు విడాకుల నోటీసులు పంపించాడు. చివరికి.. 

మధ్యప్రదేశ్ : భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం సహజమే.  కొద్ది రోజుల్లో అవి సర్దుకొని మళ్ళీ మామూలుగా అయిపోతుంటారు. కానీ కొన్నిసార్లు ఈ గొడవలు ముదిరి విడాకుల దాకా వెడుతుంటాయి. మూడో వ్యక్తి ఇందులో కలగ జేసుకుంటే గొడవలు పెద్దవి అవుతుంటాయి.  అందుకే సామాన్యంగా భార్య భర్తల గొడవల్లో ఎవరు కలగా చేసుకోరు.  సమస్య మరీ చేయి దాటి పోతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఇంటర్ఫియర్ అవుతారు. అందరూ దంపతులులాగే ఆ భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయి. మామూలుగా అయితే అవి సర్దుకునేవేనేమో.. కానీ ఓ వ్యక్తి వల్ల పరిస్థితి చేయి దాటిపోయింది. గొడవల కారణంగా ఆమె అత్యాచారానికి గురికాగా,  భర్త విడాకుల నోటీసు లు పంపించాడు.  షాక్ కు గురి చేసే ఈ ఘటన  మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

అసలేం జరిగిందంటే..
మధ్యప్రదేశ్కు చెందిన 23 ఏళ్ల హిందూ మహిళ కొన్నేళ్ళ క్రితం ఓ ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.  వివాహం అయిన తర్వాత ముస్లిం మతాన్ని కూడా స్వీకరించింది. భర్తతో కలిసి భోపాల్ లో ఉంటుంది. పెళ్లయిన కొత్తలో ఇద్దరూ బాగానే ఉండేవారు.  సంసారం సాఫీగా సాగిపోయింది. అయితే, కాలం గడిచే కొద్దీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు రావడం మొదలయ్యాయి. అది మామూలే అనుకొని కలిసిపోతే   పరిస్థితి చేజారిపోయేది కాదు. తాజాగా వీరిద్దరి మధ్య మరో గొడవ జరిగింది. ఈ విషయం భర్త స్నేహితుడికి తెలిసింది. ఎప్పటి నుంచో స్నేహితుడి భార్య మీద కన్నేసిన అతడికి ఇది ఒక అవకాశంగా కనిపించింది. 

భార్యను కరెంట్ స్తంభానికి కట్టేసి కొట్టిన భర్త.. వీడియో వైరల్ కావడంతో...

అతడు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే పేరుతో ఆ దంపతుల ఇంటికి వచ్చాడు. అక్కడ మహిళ ఒంటరిగా ఉండటంతో  తన పని సులువు అయింది. ఆమె మీద అత్యాచారం చేశాడు. దీంతో జరిగిన విషయాన్ని ఏడుస్తూ ఆమె తన భర్తకు చెప్పింది. అది విన్న భర్త భార్య మీద  సానుభూతి చూపించాల్సింది పోయి.. షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. స్నేహితుడిని ఏమీ అనలేదు సరికదా.. భార్యను ఇంట్లోనుంచి బయటకి గెంటేసాడు.. ఆ తర్వాత విడాకుల నోటీసులు పంపించాడు. దీంతో ఆమె షాక్ అయ్యింది. ఆ తరువాత  తన భర్త, అతడి స్నేహితుడు హసీబ్ సిద్దిఖ్వీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసుల అధికారులు.. ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !