
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో.. మెట్రో రైలులో అనుచిత చర్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. మెట్రోరైల్లో ముద్దులు పెట్టుకోవడం.. లోదుస్తులతో ప్రయాణించడం లాంటి ఘటనల క్రమంలో మరో ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి మెట్రో రైల్లో హస్త ప్రయోగం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో బైటికి వచ్చింది. వైరల్ గా మారింది.
దీంతో ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఈ విషయంపై నోటీసులు జారీ చేసింది. ఆ తరువాత కొన్ని గంటలకే మెట్రో రైలులో ఒక వ్యక్తి హస్తప్రయోగం చేస్తున్నాడని ఆరోపించిన వైరల్ వీడియోకు సంబంధించి ఢిల్లీ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
దీనిని పోలీసులు సూమోటోగా తీసుకున్నారని, ఐపిసి సెక్షన్ 294 కింద కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ విషయంపై విచారణ కొనసాగుతోంది. ఈ వీడియోను ట్రైన్ లో ప్రయాణిస్తున్న మరొక ప్రయాణికుడు రికార్డ్ చేశాడు. ఈ వీడియోలో, ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి తన ఫోన్‌లో ఏదో చూస్తూ.. హస్తప్రయోగం చేస్తున్నాడు. అది చూసిన అతని సమీపంలోని ఇతర ప్రయాణీకులు చాలా అసౌకర్యంగా ఫీలవ్వడం, అతని నుంచి దూరంగా వెళ్లడం కనిపించింది.
వార్నీ.. రూ. 2వేల కోసం 27 బంగారు కడ్డీలు స్మగ్లింగ్.. బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి..
ఈ వీడియోపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ స్పందిస్తూ, ఇది "పూర్తిగా అసహ్యకరమైనది, బాధాకరమైనది" అని అభివర్ణించారు. నిందితులపై తీసుకునే చర్యలు, మరోసారి మరొకరు ఇలాంటివాటికి పాల్పడకుండా ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.
ఆమె ఒక ట్వీట్‌లో, ''ఢిల్లీ మెట్రోలో ఒక వ్యక్తి సిగ్గు లేకుండా హస్తప్రయోగం చేస్తున్న వీడియో వైరల్‌గా కనిపించింది. ఇది పూర్తిగా అసహ్యకరమైనది, అనారోగ్యకరమైనది. ఈ సిగ్గుమాలిన చర్యకు వ్యతిరేకంగా సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు, ఢిల్లీ మెట్రోకు నేను నోటీసు జారీ చేస్తున్నాను.
ఈ విషయంలో నమోదైన ఎఫ్‌ఐఆర్ కాపీని, తీసుకున్న చర్యలను మే 1లోగా వివరణాత్మక నివేదికను ఇవ్వాలని కూడా డీసీడబ్ల్యూ కోరింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్ సి) కూడా ప్రయాణికులు ''బాధ్యతతో నడుచుకోవాలి'' అని ఒక ప్రకటన విడుదల చేసింది. మెట్రోలో ఫ్లయింగ్ స్క్వాడ్‌ల మోహరింపును ముమ్మరం చేస్తామని డిఎంఆర్ సి తెలిపింది.
"మెట్రోలో ఇటువంటి ప్రవర్తనను పర్యవేక్షించడానికి డిఎంఆర్ సి మెట్రో, భద్రతా సిబ్బందితో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్‌ల సంఖ్యను తీవ్రతరం చేస్తుంది. సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటాం" అని ట్వీట్ చేసింది.