ప్రేమ కోసం జైలుకెళ్లాడు.. కోర్టులో పెళ్లి చేసుకున్నాడు...!

Published : May 22, 2023, 10:33 AM IST
ప్రేమ కోసం జైలుకెళ్లాడు.. కోర్టులో పెళ్లి చేసుకున్నాడు...!

సారాంశం

యువతి తండ్రి రాజా పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ కేసు పెట్టాడు. దీంతో అతనిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.

ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయి కోసం ఏకంగా జైలు కెల్లాడు. ఆ ప్రేమను గెలిపించుకోవడం కోసం ఇప్పుడు కోర్టు ఆవరణలోనే పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన బిహార్ రాష్ట్రం సీతామఢి జిల్లా బర్గానియాలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బర్గానియాలో నివాసం ఉండే రాజా(28), అదే ప్రాంతానికి చెందిన అర్చన(23) ఒకరినొకరు ప్రేమించుకున్నారు. గత నవంబర్ లో ఇద్దరూ పెళ్లి చేసుకోవడం కోసం ఇంట్లో నుంచి పారిపోయారు. యువతి తండ్రి రాజా పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ కేసు పెట్టాడు. దీంతో అతనిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.

ఈ కేసుపై ఇటీవల ఓ స్థానిక కోర్టులో విచారణ జరిగింది. అర్చన, రాజాకి  పెళ్లి జరిపిస్తామని ఇరు కుటుంబ సభ్యులు కోర్టుకు తెలియజేశారు దీంతో దీనికి న్యాయస్థానం కూడా అంగీకరించింది. ఇంకేముందు పోలీసులు సమక్షంలో, కోర్టు ఆవరణలోనే వీరి పెళ్లి జరిపించడం విశేషం. పెళ్లి అనంతరం రాజాని మళ్లీ పోలీసులు జైలుకు తీసుకువెళ్లారు.  ఈ కేసు విచారణ త్వరలోనే మళ్లీ కోర్టు ముందుకు రానుంది. ఆ రోజు అతనిపై ఉన్న కేసును న్యాయస్థానం కొట్టి వేసే అవకాశం ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu