బస్సులో నిద్రిస్తున్న యువతికి.. పదే పదే ముద్దులు పెట్టిన పోకిరి...

Published : Sep 17, 2021, 09:46 AM ISTUpdated : Sep 17, 2021, 09:52 AM IST
బస్సులో నిద్రిస్తున్న యువతికి.. పదే పదే  ముద్దులు పెట్టిన పోకిరి...

సారాంశం

గురువారం తెల్లవారుజామున 5 గంటలప్పుడు  బస్సు బెంగళూరు పీణ్యా వద్ద ఉండగా యువతి నిద్రలోకి జారుకుంది. ఈ సమయంలో ఓ యువకుడు పదే పదే ముద్దు పెట్టాడని యువతి ఆరోపించింది. 

కర్ణాటకలో పోకిరీ రెచ్చిపోయాడు. బస్సులో నిద్రిస్తున్న యువతిని ఓ పోకిరీ యువకుడు ముద్దు పెట్టుకుని అశ్లీలంగా ప్రవర్తించాడు. బాధిత యువతి ఆర్కిటెక్చర్ విద్యార్థిని. కాగా, బుధవారం రాత్రి 10.40కి బళ్లారిలో కేఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కింది. 

గురువారం తెల్లవారుజామున 5 గంటలప్పుడు  బస్సు బెంగళూరు పీణ్యా వద్ద ఉండగా యువతి నిద్రలోకి జారుకుంది. ఈ సమయంలో ఓ యువకుడు పదే పదే ముద్దు పెట్టాడని యువతి ఆరోపించింది. గాఢ నిద్రలో ఉండి.. మెలకువ వచ్చి చూసే సరికి జరుతున్న దారణం అర్థమయ్యింది. 

కరోనా నుంచి కోలుకున్న తర్వాత.. పిత్తాశయ సమస్యలు..!

వెంటనే కంగారుగా కళ్లు తెరిచింది కానీ.. ఆ భయాందోళనలో అతను ఎవరో గుర్తించలేకపోయింది. వెంటనే భయంతో యువతి బస్సు దిగి పీణ్యా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు యువకుని కోసం గాలింపు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word